ETV Bharat / bharat

How To Success In Interview : ఇంటర్వ్యూకు సిద్ధం అవుతున్నారా?.. ఈ టిప్స్​ పాటిస్తే ఉద్యోగం గ్యారెంటీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 10, 2023, 12:01 PM IST

How To Success In Interview In Telugu : మీరు ఇంటర్వ్యూ కోసం సిద్ధం అవుతున్నారా? దానిని ఎలా ఎదుర్కోవాలో తెలియక తికమకపడుతున్నారా? అయితే ఇది మీ కోసమే. కొన్ని సింపుల్ టిప్స్ ఉపయోగిస్తే.. చాలా ఈజీగా ఇంటర్వ్యూలో విజయం సాధించవచ్చు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Tips for a Successful Interview
how to success in interview

How To Success In Interview : నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడం అంత తేలికైన వ్యవహారం కాదు. ఎంతో ప్రతిభ ఉన్న అభ్యర్థులు సైతం ఇక్కడ నెగ్గుకురావడం చాలా కష్టమైపోతోంది. వాస్తవానికి రాత పరీక్షలో ఎంతో ప్రతిభ చూపించినప్పటికీ.. ఇంటర్వ్యూ అనేసరికి వారిలో తెలియని ఒక బెరుకు ఏర్పడుతుంది. కానీ కొన్ని సింపుల్ టిప్స్ ఉపయోగించి, ఆన్​లైన్​/ ఆఫ్​లైన్​ ఇంటర్వ్యూల్లో చాలా సులభంగా సక్సెస్ కావచ్చు. అందుకే ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Face To Face Interview Tips In Telugu

  1. ముందుగా సంస్థ గురించి తెలుసుకోవాలి : అభ్యర్థులు ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నప్పుడే.. సదరు సంస్థకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవాలి. అలాగే మీరు అప్లై చేసిన ఉద్యోగం గురించి, నిర్వర్తించాల్సిన విధుల గురించి అవగాహన ఏర్పరుచుకోవాలి.
  2. సరైన వస్త్రధారణ ఉండాలి : అభ్యర్థులు తమ వస్త్రధారణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గౌరవప్రదంగా, హుందాతనం ఉట్టిపడేలా వస్త్రధారణ ఉండాలి. అలాకాకుండా ఇష్టం వచ్చినట్లు వెళితే.. తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది.
  3. పత్రాలు అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి : అభ్యర్థులు ముఖాముఖి (ఇంటర్వ్యూ) కోసం వెళ్లేటప్పుడు.. కచ్చితంగా జాబ్​ అప్లికేషన్​, రెజ్యూమ్​ కాపీలు, విద్యార్హత పత్రాలు, ఫొటోలు తీసుకువెళ్లాలి.
  4. సమయపాలన ప్రధానం : అభ్యర్థులకు సమయపాలన అనేది చాలా ముఖ్యం. అందువల్ల ఇంటర్వ్యూ సమయాని కంటే.. కాస్త ముందుగా సదరు సంస్థ వద్దకు చేరుకోవాలి. ఇలా చేయడం వల్ల అనవసరపు ఆందోళన, ఒత్తిడి లేకుండా ఉంటుంది. ఒక వేళ మీరు ఆలస్యంగా వెళితే.. మీకు క్రమశిక్షణ లేదని తలచి.. మిమ్మల్ని ఉద్యోగానికి ఎంపిక చేయకపోవచ్చు.
  5. హుందాగా వ్యవహరించాలి : అభ్యర్థుల ప్రవర్తన చాలా హుందాగా ఉండాలి. ఇంటర్వ్యూ బోర్డ్​ ముందుకు వెళ్లినప్పుడు అందరికీ నమష్కారం చేయాలి. మాట్లాడే భాష కూడా బాగుండాలి. భావ వ్యక్తీకరణ స్పష్టంగా ఉండాలి. అప్పుడే మీపై మంచి ఇంప్రెషన్ కలుగుతుంది.
  6. హావభావాలు బాగుండాలి : అభ్యర్థులు చాలా ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి. ప్రశాంతంగా ఉండాలి. చిరునవ్వుతో సమాధానాలు చెప్పాలి. సింపుల్​గా చెప్పాలంటే.. హావభావాలు చాలా బాగుండాలి. అంతేకాని చేతులు కట్టుకుని కూర్చోవడం, అదేపనిగా కాళ్లు కదపడం, కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం, ముందున్న బల్లపై ఒరిగిపోవడం, ముఖంపై చేతులు పెట్టుకోవడం లాంటి పనులు చేయకూడదు.
  7. నిజాయితీగా ఉండాలి : ఇంటర్వ్యూలో మీ వ్యక్తిత్వాన్ని, నిజాయితీని పరిశీలిస్తారు. వాస్తవానికి అందరికీ అన్ని విషయాలు తెలియవు. కనుక ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పాలి. ఒక వేళ జవాబు తెలియకపోతే.. ఆ విషయాన్ని చాలా కచ్చితంగా చెప్పాలి. అంతే తప్ప.. ఏదో మేనేజ్ చేయాలని చూడకూడదు. తెలియని విషయాలను తెలిసినట్లుగా చెప్పాలని చూస్తే.. రిక్రూటర్లు సులభంగా దానిని పసిగట్టేస్తారు. మీ మార్కులు తగ్గిస్తారు.
  8. రెజ్యూమ్​కు భిన్నంగా సమాధానాలు చెప్పకూడదు : ఇంటర్వ్యూలో మీరు చెప్పే సమాధానాలు.. రెజ్యూమ్​లో పేర్కొన్న వాటికి భిన్నంగా ఉండకూడదు. అలాగే ఇంటర్వ్యూ ముగిసిన తరువాత.. అందరికీ ధన్యవాదాలు చెప్పడం మరిచిపోకూడదు. ఇలాంటి చిన్నచిన్న టిప్స్ పాటిస్తే.. (ముఖాముఖి) ఇంటర్వ్యూలో విజయం సాధించడం గ్యారెంటీ!

వర్చువల్ ఇంటర్వ్యూలో విజయం సాధించడం ఎలా?
Online Interview Tips For Freshers : కరోనా తరువాత వర్చువల్ ఇంటర్వ్యూలు బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా లేటెస్ట్ టెక్నాలజీతో ఇది మరింత సులభతరమైంది. మరి మీరు కూడా ఆన్​లైన్ ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఇక్కడ చెప్పిన టిప్స్​ మీకు బాగా ఉపయోగపడతాయి.

  1. డ్రస్సింగ్ సెన్స్​ బాగుండాలి : ఆన్​లైన్​ ఇంటర్వూ అయినప్పటికీ దుస్తుల విషయంలో ఎలాంటి అశ్రద్ధ చూపకూడదు. హుందాతనం ఉట్టిపడేలా, ప్రొఫెషనల్​గా దుస్తులు ధరించాలి. ఫ్యాన్సీ దుస్తులు వేసుకుని, ఓవర్​ మేకప్​ చేసుకోకూడదు. జుత్తు విషయంలోని జాగ్రత్తలు తప్పనిసరి.
  2. ప్లాట్‌ఫామ్‌పై అవగాహన ఏర్పరుచుకోవాలి : నేడు ఆన్​లైన్ ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు అనేక ప్లాట్​ఫామ్​లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఏ ప్లాట్​ఫామ్​లో ఇంటర్వ్యూ జరుగుతుందో ముందుగానే తెలుసుకోవాలి. సదరు ప్లాట్​ఫామ్​లోని ఆప్షన్​లు అన్నింటిపై ముందుగానే ఒక అవగాహనకు రావాలి. దీని వల్ల ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది, ఆందోళన చెందకుండా ఉండగలుగుతారు. మీ ఫ్లో కూడా మిస్​ కాకుండా ఉంటుంది.
  3. నోట్స్‌ ప్రిపేర్ చేసుకోవాలి : ఇంటర్వ్యూకు ముందు కచ్చితంగా.. మీరు చేసిన ఇంటర్న్​షిప్​లు, ప్రాజెక్టుల వివరాలను, అలాగే మీ ప్రొఫైల్ వివరాలను ఒక పేజ్​లో బుల్లెట్ పాయింట్స్ మాదిరిగా రాసుకోవాలి. ఇంటర్వ్యూలో వీటిని ఎలా ప్రెజెంట్ చేయాలో కూడా ముందే ప్రాక్టీస్ చేయాలి. దీని వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటర్వ్యూ చేయగలుగుతారు. ఒక వేళ ఏదైనా విషయం మరిచిపోయినా.. వెంటనే మీరు ముందే ప్రిపేర్ చేసుకున్న బుల్లెట్ పాయింట్స్​ను చెక్ చేసుకోవడానికి వీలు అవుతంది. కానీ మీరు పూర్తిగా పేపర్ చూస్తూ సమాధానాలు ఇస్తూ ఉంటే.. అది మీపై బ్యాడ్ ఇంప్రెషన్ కలిగేలా చేస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
  4. జాగ్రత్తగా మాట్లాడాలి : సాధారణంగా నేరుగా ముఖాముఖి కూర్చొని చేసే ఇంటర్వ్యూలో.. మనం కాస్త వేగంగా మాట్లాడినా ఫర్వాలేదు. కానీ ఆన్​లైన్​లో కాస్త నిదానంగా మాట్లాడడమే మంచిది. అయితే మరీ నెమ్మదిగా అవతలివారికి బోర్ కొట్టేలా మాత్రం మాట్లాడకూడదు. సూటిగా, స్పష్టంగా చెప్పదలచుకున్నది చెప్పాలి. అవసరాన్ని అనుసరించి మీ చేతులు ఉపయోగించి, విషయాన్ని వివరించే ప్రయత్నం చేయవచ్చు.
  5. బ్యాక్​ గ్రౌండ్​ బాగుండాలి : ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ అనగానే ఇంట్లోనే కదా అని చాలా మంది తేలికగా తీసుకుంటారు. కానీ ఇది సరైన విధానం కాదు. మన చుట్టుపక్కల వాతావరణం కూడా మన ఉద్యోగావకాశాలను ప్రభావితం చేయగలదు. వీలైనంత వరకూ మీరు కూర్చున్న ప్రదేశంలో.. వెనక వైపు ఖాళీ ప్రదేశం లేదా గోడ ఉండటం మంచిది. లేదంటే మీరు అకడమిక్, క్రీడాంశాల్లో సాధించిన ట్రోఫీలు లాంటివి అలంకరించవచ్చు.
  6. అలవాటు చేసుకోవాలి : సాధారణంగా కొత్తవారికి.. ఆన్​లైన్ ఇంటర్వ్యూల్లో, వీడియో కాల్స్​లో మాట్లాడడం కష్టంగా ఉంటుంది. అందువల్ల ఇంటర్వ్యూల్లో కాస్త తడబాటుకు, ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఇలాంటి సమస్య తలెత్తకుండా ఉండాలంటే.. ముందుగానే ఈ ప్రక్రియను అలవాటు చేసుకోవాలి. ఇందుకోసం స్నేహితుల, ఉపాధ్యాయుల సహకారం తీసుకోవడం మంచిది. దీని వల్ల మీ బాడీ లాంగ్వేజ్​, మాటతీరు లాంటి వాటిని చాలా సులువుగా మార్చుకోవచ్చు. బెరుకుతనం కూడా పోతుంది.
  7. కంగారు పడవద్దు : అప్పుడప్పుడు కొన్ని సాంకేతిక సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇంటర్వ్యూ మధ్యలో అంతరాయం ఏర్పడుతూ ఉంటుంది. కొన్ని సార్లు అనుకోకుండా లాగ్​ఔట్​ అయిపోతుంటారు. ఇలాంటి సమయంలో కంగారు పడకూడదు. చాట్ ఆప్షన్​ ద్వారా ఇంటర్వ్యూ చేసేవారికి.. సాంకేతిక సమస్య గురించి సమాచారం తెలియజేయాలి. ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేసే అవకాశం ఉందోమో అడిగి తెలుసుకోవాలి. కొన్ని కంపెనీలు ఇంటర్వ్యూ షెడ్యూల్​కు ముందే.. అభ్యర్థులకు వర్చువల్ ఇంటర్వ్యూలు చేసేందుకు తగిన శిక్షణ ఇస్తాయి. ఇలాంటి అవకాశం మీకూ ఉంటే.. దానిని సరిగ్గా వినియోగించుకోవాలి.
  8. సర్వసన్నద్ధంగా ఉండాలి : ఇంటర్వ్యూ కోసం ముందుగానే బాగా ప్రిపేర్ కావాలి. అవసరమైన ఎలక్ట్రానిక్ డివైజ్​లు, గ్యాడ్జెట్లు సిద్ధంగా ఉంచుకోవాలి. లైటింగ్ సెటప్ కూడా ఏర్పాటుచేసుకోవాలి. నెట్​ కనెక్షన్ బాగా ఉండేలా చూసుకోవాలి. మీ ఇంటర్వ్యూ సమయంలో ఇతరులు వైఫై వాడకుండా ఉండేలా చూసుకోవాలి. వీలైనంత వరకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఫోన్స్ సైలెంట్​లో పెట్టుకోవాలి. అలాగే ఇంటర్వ్యూ జరుగుతున్న గదిలోకి ఎవరూ రాకుండా చూసుకోవాలి.
  9. ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం ముఖ్యం : ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూను ఎదుర్కోవాలి. భిన్నమైన అంశాలపై సమాధానాలు ఇచ్చేటప్పుడు సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించాలి. దేనినైనా వ్యతిరేకిస్తూ ఉంటే కూడా.. దానిని క్రిటికల్​గా వివరించాలి. అలాగే ముఖ కవళికలు, బాడీ లాంగ్వేజ్ విషయంలో జాగ్రత్త వహించాలి.
  10. కెమెరాను చూడాలి : చాలా మంది స్క్రీన్ మీద ఉన్న ఇంటర్వ్యూ చేసే వ్యక్తులను చూస్తూ ఉంటారు. కానీ ఇది సరైనది కాదు. కెమెరా వైపు చూస్తూ మాట్లాడాలి. అప్పుడే అవతలివారితో మీకు 'ఐ కాంటాక్ట్' ఏర్పడుతుంది. అలాగే మీరు మాట్లాడుతున్నంత సేపు మొహంలో చిరునవ్వు చెదరకూడదు. ఆత్మవిశ్వాసంతో, నిజాయితీగా సమాధానాలు చెప్పాలి. ఇలాంటి చిన్నచిన్న టిప్స్ పాటిస్తే.. వర్చువల్ ఇంటర్వ్యూల్లో కూడా సులువుగా విజయం సాధించవచ్చు. ఆల్​ ది బెస్ట్​!

GRSE Apprentice Jobs 2023 : ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా అర్హతతో.. GRSEలో అప్రెంటీస్ పోస్టులు.. దరఖాస్తు చేసుకోండిలా!

BEL Engineering Jobs 2023 : బీఈ, బీటెక్​ అర్హతతో.. BELలో ప్రొబేషనరీ ఇంజినీర్​, ఆఫీసర్​​ పోస్టులు.. అప్లై చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.