ETV Bharat / bharat

BEL Engineering Jobs 2023 : బీఈ, బీటెక్​ అర్హతతో.. BELలో ప్రొబేషనరీ ఇంజినీర్​, ఆఫీసర్​​ పోస్టులు.. అప్లై చేసుకోండిలా!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 5, 2023, 10:47 AM IST

BEL Engineering Jobs 2023 In Telugu : ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ భారత్​ ఎలక్ట్రానిక్స్​ లిమిటెడ్​ (BEL) 232 ప్రొబేషనరీ ఇంజినీర్​, ప్రొబేషనరీ ఆఫీసర్, ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

BEL Recruitment 2023 for 232  Probationary Engineer Posts
BEL Engineering Jobs 2023

BEL Engineering Jobs 2023 : ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్​. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ భారత్​ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్​ (BEL) 232 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు

  • ప్రొబేషనరీ ఇంజినీర్​ - 205 పోస్టులు
  • ప్రొబేషనరీ ఆఫీసర్​ (HR) - 12 పోస్టులు
  • ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్​ - 15 పోస్టులు

విద్యార్హతలు

  • అభ్యర్థులు ఆయా ప్రొబేషనరీ ఇంజినీరింగ్ పోస్టులకు అనుగుణంగా.. బీఈ, బీటెక్​, బీఎస్సీ చేసి ఉండాలి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్​ అండ్​ కమ్యునికేషన్​/ మెకానిక్​/కంప్యూటర్​ సైన్స్​ విభాగాల్లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్​ పూర్తి చేసి ఉండాలి.
  • ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు రెండేళ్లు వ్యవధి గల.. ఎంబీఏ, ఎంఎస్​డబ్ల్యూ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా ఇన్​ హ్యూమన్​ రిసోర్స్​ కోర్సులు చేసి ఉండాలి.
  • ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలకు సీఏ/ సీఎంఏ చేసి ఉండాలి.

వయోపరిమితి

  • ప్రొబేషనరీ ఇంజినీర్​, ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 2023 సెప్టెంబర్​ 1 నాటికి గరిష్ఠంగా 25 ఏళ్లకు మించి ఉండకూడదు.
  • ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు.. అభ్యర్థుల వయస్సు 2023 సెప్టెంబర్ 1 నాటికి 30 ఏళ్లు లోపు ఉండాలి.
  • ప్రభుత్వ నిబంధనలు అనుసరించి, ఆయా కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము

  • జనరల్​, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.1180 చెల్లించాలి
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి పరీక్ష రుసుము లేదు.

ఎంపిక విధానం
అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. అందులోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు
ఆయా పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000 - రూ.1,40,000 వరకు జీతభత్యాలు ఉంటాయి. అలాగే డీఏ, హెచ్​ఆర్​ఏ, మెడికల్ రీయంబర్స్​మెంట్ సహా పలు బెనిఫిట్స్ లభిస్తాయి.

దరఖాస్తు విధానం
ఆసక్తిగల అభ్యర్థులు BEL అధికారిక వెబ్​సైట్​ https://cdn.digialm.com/EForms/configuredHtml/1258/84142/Index.html లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్​లైన్​ దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 అక్టోబర్ 28
  • కంప్యూటర్ ఎగ్జామ్​ : 2023 డిసెంబర్​లో జరగవచ్చు.

NCL Apprentice Jobs 2023 : ఐటీఐ అర్హతతో.. NCLలో 1140 అప్రెంటీస్​ పోస్టులు.. అప్లై చేసుకోండిలా!

ESIC Paramedical Recruitment 2023 : ESICలో 1038 ఉద్యోగాలు.. తెలంగాణలోనూ ఖాళీలు.. పూర్తి వివరాలు ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.