ETV Bharat / bharat

కేరళలో కామ్రేడ్ల హవా- యూడీఎఫ్​కు నిరాశ

author img

By

Published : May 2, 2021, 10:29 AM IST

kerala assembly polls
కామ్రేడ్ల హవా

కేరళలో కామ్రేడ్లు పూర్తి ఆధిక్యం కనబరుస్తున్నారు. సీఎం పినరయి విజయన్​ నేతృత్వంలోని ఎల్​డీఎఫ్ అధిక స్థానాల్లో ముందంజలో ఉంది. యూడీఎఫ్ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది.

కేరళలో అధికార మార్పిడి సంప్రదాయానికి చరమగీతం పాడి చరిత్ర సృష్టించే దిశగా కామ్రేడ్లు దూసుకెళ్తున్నారు. యూడీఎఫ్​పై స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 140 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో సీఎం పినరయి విజయన్​ నేతృత్వంలోని ఎల్​డీఎఫ్​ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది.

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఆ పార్టీ తరఫున నిమోమ్​ నుంచి పోటీ చేసిన కుమ్మనమ్ రాజశేఖరన్, పాలక్కడ్​ అభ్యర్థి మెట్రో మ్యాన్​ శ్రీధరన్ మాత్రం ఆధిక్యంలో ఉన్నారు.

ఇదీ చూడండి: నందిగ్రామ్​లో మమతా బెనర్జీ వెనుకంజ

తమిళనాడులో దూసుకెళ్తున్న డీఎంకే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.