ETV Bharat / bharat

సంక్షేమ మంత్రంపైనే కేరళ కామ్రేడ్ల ఆశలు

author img

By

Published : Mar 21, 2021, 11:52 AM IST

LDF all set with a welfare, growth oriented poll manifesto; Symbol might be a problem for Joseph and Suresh Gopi
సంక్షేమం, అభివృద్ధికే ఎల్​డీఎప్​ పెద్దపీట

కేరళలో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఆకర్షణీయ పథకాలతో మేనిఫెస్టోను రూపొందించింది ఎల్​డీఎఫ్​. ఎప్పటిలాగే ఇతర పార్టీల కంటే ముందే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మరోవైపు నటుడు సురేష్ గోపి కమలం గుర్తుతో పోటీ విషయంపై సందిగ్ధత నెలకొంది.

కేరళలో ఎప్పటిలానే ఎన్నికల మేనిఫెస్టోను మొదటగా విడుదల చేసి తన సంప్రదాయాన్ని ఎల్​డీఎఫ్​ కొనసాగించింది. రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఆకర్షణీయ పథకాలను ప్రకటించింది. సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసింది. యువతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ కోసం 40లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తామని హామీ ఇచ్చింది. వ్యవసాయం రంగంలో ఆదాయాన్ని 50 శాతం పెంచేలా చర్యలు చేపడతామని తెలిపింది.

ఇదీ చూడండి: చర్చిల చుట్టూ రాజకీయం- ఓట్ల కోసం గాలం!

తాము అధికారంలోకి వస్తే చేపట్టబోయే 50 కార్యక్రమాల గురించి మేనిఫెస్టోను రెండు విభాగాలుగా తయారు చేసింది యూడీఎఫ్.

మేనిఫెస్టోలోని ముఖ్య హామీలు..

  • ఏడాది కాలంలో 1.50లక్షల ఇళ్ల నిర్మాణం
  • ప్రస్తుతం రూ.1600గా ఉన్న సంక్షేమ పింఛను దశల వారీగా ఐదేళ్లలో రూ.2500కు పెంపు
  • గృహిణులకు ప్రత్యేక పింఛను పథకం
  • రబ్బరు కనీస ధర కిలోకు రూ.250కి పెంపు
  • తీరప్రాంత అభివృద్ధికి రూ.5000కోట్ల ప్యాకేజీ
  • పేదరిక నిర్మూలనకు రుణ సాయం
  • సమాజంలోని అన్నివర్గాల మత విశ్వాసాలను పరిరక్షించడం
  • 2040వరకు విద్యుత్​ సంక్షోభం లేకుండా ప్రత్యేక ప్రాజెక్టు

ఎన్డీఏలో అయోమయం..

కేరళ అసెంబ్లీ ఎన్నికలకు శుక్రవారంతో నామినేషన్ల గడువు ముగిసింది. అయితే ఎన్డీఏ పార్టీలు భాజపా, భారత్ ధర్మ జన సేన(బీడీజేఎస్) పూంజర్​, ఎట్టుమనూర్​ నియోజకవర్గాల్లో రెండు పార్టీల నుంచి అభ్యర్థును బరిలోకి దించడం కూటమిలో ఆయోమయానికి తెరతీసింది. చివరకు రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఎట్టుమనూర్​ నుంచి భాజపా, పూంజర్​ నుంచి బీడీజేఎస్​ అభ్యర్థులు పోటీ చేయాలని తుది నిర్ణయానికి వచ్చాయి.

త్రిస్సూర్​ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్న నటుడు, భాజపా నేత సురేష్ గోపీ కమలం గుర్తుతో పోటీ చేసే విషయం సందిగ్ధం నెలకొంది. రాష్ట్రపతి నామినేషన్​ ద్వారా ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్న ఆయనకు అసెంబ్లీ ఎన్నికల్లో కమలం గుర్తుపై పోటీ చేయడం కుదరదు.

ఇదీ చూడండి: భాజపా అభ్యర్థిగా సురేశ్​ గోపి నామినేషన్

ఇదీ చూడండి: 'విజయన్​ సీటు'కు ఎందుకంత క్రేజ్​?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.