ETV Bharat / bharat

కునో జాతీయ పార్కులో మరో చీతా మృతి- 10కి చేరిన మరణాలు

author img

By PTI

Published : Jan 16, 2024, 7:13 PM IST

Updated : Jan 16, 2024, 7:57 PM IST

Kuno Cheetah Death : మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో మరో చీతా మరణించింది. నమీబియా నుంచి తెచ్చిన చీతాల్లో ఒకటైన శౌర్య మంగళవారం మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

10th Cheetah Dies At Kuno National Park In Madhya Pradesh
Kuno Cheetah Death- Namibian Cheetah Shaurya Died

Kuno Cheetah Death : మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో మరో చీతా ప్రాణాలు కోల్పోయింది. నమీబియా నుంచి తెచ్చిన చీతాల్లో ఒకటైన శౌర్య మంగళవారం మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఉదయం చీతా తూలుతూ నడవడాన్ని గుర్తించిన ట్రాకింగ్‌ బృందం బలహీనంగా ఉన్న ఆ చీతాకు వెంటనే చికిత్స అందించారు. ఆ తర్వాత అది కాస్త కోలుకున్నట్లే కన్పించినా మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో చీతా చనిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. పోస్ట్‌మార్టం తర్వాతే మృతికి గల కారణాలపై స్పష్టత వస్తుందన్నారు.

"నమీబియా నుంచి తెచ్చిన మరో చీతా శౌర్య మృతి చెందిన సమాచారం మాకు అందింది. శౌర్య ఆరోగ్య పరిస్థితిని దానికి అమర్చిన ట్రాకింగ్​ సిస్టమ్​ ద్వారా పర్యవేక్షించాము. మంగళవారం ఉదయం దాని నడకలో పలు ఇబ్బందులను గుర్తించాము. దానిని సరిచేసేందుకు పశువైద్యులు తీవ్రంగా శ్రమించారు. అయినప్పటికీ దానిని కాపాడుకోలేక పోయాము. మధ్యాహ్నం 3:17 గంటలకు శౌర్య చీతా ప్రాణాలు విడిచింది. దీని మరణానికి గల కారణాలు పోస్ట్​మార్టం రిపోర్ట్​ వచ్చిన తర్వాతే తెలుస్తుంది."
- నగర్​ సింగ్​ చౌహాన్, మధ్యప్రదేశ్​ పర్యావరణ శాఖ మంత్రి

10కి చేరిన మరణాలు
దేశంలో ఇప్పటివరకు మృతిచెందిన చీతాల సంఖ్య 10కి చేరింది. దేశంలో అంతరించిపోయిన ఈ వన్యప్రాణి జాతిని భారత్‌లో పునఃప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రాజెక్టు చీతాను చేపట్టింది. ఇందులో భాగంగా నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి రెండు విడతల్లో 20 చీతాలను భారత్‌కు రప్పించారు. వాటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో విడిచిపెట్టారు. ఇందులో ఆరు చీతాలు పలు కారణాలతో చనిపోయాయి. గతేడాది మార్చిలో జ్వాల అనే మరో నమీబియా చీతాకు నాలుగు కూనలు పుట్టగా, అనారోగ్య కారణాలతో అందులో మూడు మృతి చెందాయి. తాజా మరణంతో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన చీతాల సంఖ్య 10కి చేరినట్లు అధికారులు ధ్రువీకరించారు.

Cheetah Death In Kuno : గతేడాది ఆగస్టులో కూడా 'ధాత్రి' అనే ఆడ చీతా ఇదే పార్క్​లో ప్రాణాలు కోల్పోయింది. ఈ వార్త పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

4 పిల్లలకు జన్మనిచ్చిన చీతా.. 70 ఏళ్ల తర్వాత భారత్​లో తొలిసారి

కునో నేషనల్ పార్క్​లో మరో మగ చీతా మృతి.. గత 4 నెలల్లో 8 మరణాలు

Last Updated : Jan 16, 2024, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.