ETV Bharat / bharat

కొండచరియలు విరిగిపడిన ఘటనలో 13కు చేరిన మృతులు

author img

By

Published : Aug 12, 2021, 8:33 AM IST

హిమాచల్ ప్రదేశ్​లోని కిన్నౌర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 13కు చేరింది. ఈ విషయాన్ని ఐటీబీపీ అధికారులు స్పష్టం చేశారు.

HP, kinnaur
కొండచరియలు, హిమాచల్ ప్రదేశ్

హిమాచల్​ ప్రదేశ్​లో కిన్నౌర్‌ జిల్లాలోని రెకాండ్‌ పియో- సిమ్లా రహదారిపై పెద్ద ఎత్తున.. కొండచరియలు విరిగిపడటం వల్ల శిథిలాల కింద 50-60మందికి పైగా చిక్కుకుపోయారు. బుధవారం జరిగిన ఈ ఘటనలో.. ఇప్పటివరకు 13 మృతదేహాలను వెలికితీసినట్లు ఐటీబీపీ అధికారులు పేర్కొన్నారు.

కిన్నౌర్‌ నుంచి సిమ్లాకు వెళ్తోన్న హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వ రవాణాకు చెందిన ఓ ప్రయాణికుల బస్సు, ఓ ట్రక్కు, కొన్ని కార్లు కొండచరియల కింద చిక్కుకున్నట్లు ఐటీబీపీ పోలీసులు వెల్లడించారు. బస్సులోనే సుమారు 40 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు కిన్నౌర్‌ డిప్యూటి కమిషనర్‌ హుస్సేన్‌ సిద్ధిఖ్‌ చెప్పారు.

ఇదీ చదవండి:పెద్దలు బతకడానికి ఆ రాష్ట్రాలే బెటర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.