ETV Bharat / bharat

Corona cases: కేరళలో భారీగా తగ్గిన కొవిడ్ కేసులు..

author img

By

Published : Oct 21, 2021, 10:19 PM IST

kerala corona cases
కేరళలో కరోనా కేసులు

కేరళలో కరోనా కేసులు(Kerala Corona Cases) మళ్లీ తగ్గాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా 8,743 మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. మరో 118 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో 1,573 మందికి కరోనా నిర్ధరణ అయింది. మరో 39 మంది మరణించారు.

కేరళలో కరోనా రోజువారీ కేసులు(Kerala Corona Cases) క్రితం రోజుతో పోలిస్తే భారీగా తగ్గాయి. కొత్తగా ఆ రాష్ట్రంలో 8,743 మంది.. వైరస్(Kerala Corona Cases) బారిన పడినట్లు తేలింది. వైరస్​(Kerala Covid Cases News) కారణంగా మరో 118 మంది మృతి చెందారు. ఫలితంగా ఇప్పటివరకు కేరళలో నమోదైన మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 48,79,317కు చేరింది. మరణాల సంఖ్య 27,202కు పెరిగింది. మరో 9,855 మంది కోలుకోగా యాక్టివ్ కేసుల సంఖ్య 81,496కు పడిపోయింది.

కేరళలో గురువారం 86,303 నమూనాలను పరీక్షించారు. ఎర్నాకులం​ జిల్లాలో అత్యధికంగా 1,434 మందికి కొత్తగా వైరస్​ సోకినట్లు తేలింది. తిరువనంతపురంలో 1,102, త్రిస్సూర్​లో 1,031 మందికి వైరస్ నిర్ధరణ అయింది.

మహారాష్ట్రలో కొత్తగా 1,573 మందికి కరోనా(Maharashtra Coronavirus) సోకింది. మరో 39 మంది వైరస్ కారణంగా మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 65,98,218కి చేరగా.. మరణాల సంఖ్య 1,39,925కు పెరిగింది. మరో 2,968 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.

దేశ రాజధాని దిల్లీలో 22 కొవిడ్​(Delhi Covid Cases Today) కేసులు బయటపడ్డాయి. వైరస్​ కారణంగా కొత్తగా ఎవరూ చనిపోలేదు.

వివిధ రాష్ట్రాల్లో కొత్త కేసులు ఇలా..

  • తమిళనాడులో 1,164 మంది మహమ్మారి బారినపడ్డారు. 1,412 మంది వైరస్ నుంచి కోలుకోగా.. మరో 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • కర్ణాటకలో కొత్తగా 365 కరోనా కేసులు నమోదయ్యాయి. 443 మంది కోలుకోగా.. 8 మంది మృతిచెందారు.
  • ఒడిశాలో కొత్తగా 524 మందికి కరోనా సోకగా.. మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
  • బంగాల్​లో 690 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి. 12 మంది మరణించారు.
  • గోవాలో 59, మధ్యప్రదేశ్​లో 12 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.

మరోవైపు.. దేశంలో కరోనా టీకా పంపిణీ సరికొత్త మైలురాయిని చేరుకుంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 100 కోట్ల మార్కును దాటినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.