ETV Bharat / bharat

లాక్​డౌన్​లో రోజుకు 20గంటలు కష్టపడి.. 145 సర్టిఫికెట్లు సాధించి..

author img

By

Published : Jan 8, 2022, 1:18 PM IST

Updated : Jan 8, 2022, 1:49 PM IST

Kerala Man Obtains 145 Certificates: లాక్​డౌన్ సమయాన్ని పూర్తిగా వినియోగించుకుని.. 145కుపైగా సర్టిఫికెట్లను సాధించారు కేరళకు చెందిన షఫీ విక్రమాన్. ప్రపంచవ్యాప్తంగా 16 దేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో ఈ కోర్సులను పూర్తి చేశారు. ఆయన స్టోరీని మీరూ చూడండి.

Kerala man claims obtaining over 145 certificates
లాక్​డౌన్​లో రోజుకు 20గంటలు కష్టపడి

లాక్​డౌన్​లో రోజుకు 20గంటలు కష్టపడి.. 145 సర్టిఫికెట్లు సాధించి..

Kerala Man Obtains 145 Certificates: ఒక్క కోర్సు పూర్తిచేయడానికే నానా తంటాలు పడుతుంటారు కొందరు. అలాంటిది కేరళకు చెందిన షఫీ విక్రమాన్ ఏకంగా 145 సర్టిఫికెట్లను సాధించారు.

Kerala man claims obtaining over 145 certificates
సర్టిఫికెట్లతో షఫీ
Kerala man claims obtaining over 145 certificates
షఫీ విక్రమాన్​ సాధించిన సర్టిఫికెట్లు

లాక్​డౌన్ సమయంలో అందరూ చదువుకు దూరంగా ఉండి.. సినిమాలు, వినోద కార్యక్రమాలతో టైం అంతా గడిపితే.. తిరువనంతపురానికి షఫీ మాత్రం అందుకు భిన్నంగా అలోచించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 145 కోర్సులను పూర్తి చేశారు.

Kerala man claims obtaining over 145 certificates
షఫీ విక్రమాన్​ సాధించిన సర్టిఫికెట్లు

లాక్​డౌన్​ సమయంలో రోజుకు 20గంటలు కష్టపడి వర్చువల్​గానే ఈ కోర్సులను పూర్తిచేశారు. ప్రపంచవ్యాప్తంగా 16 దేశాల్లోని పలు యూనివర్సిటీల నుంచి ఈ సర్టిఫికెట్లను సాధించారు విక్రమాన్​.

ఇదంతా జూన్​, 2020లో మొదలైంది. ఆ సమయంలో మా బంధువొకరు ఓ వెబినార్​లో పాల్గొనమని చెప్పారు. అందులో నేను పాల్గొన్నాను. ఆ తర్వాత వెబినార్​లో పాల్గొన్నవారికి ఉచితంగా వివిధ కోర్సులు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా కొన్ని యూనివర్సిటీలు ఆహ్వానించాయి. అలా సర్టిఫికెట్లు సాధించాను. మనదేశంతో పోల్చితే అక్కడి విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు ఎంతో సహకరిస్తాయి. ఇన్ని కోర్సులు ఇక్కడ పూర్తిచేయలేము. ఒకటి లేదా రెండు మాత్రమే ఇక్కడు పూర్తిచేయగలుగుతాం.

-- షఫీ విక్రమాన్

లాక్​డౌన్ సమయాన్ని తాను పూర్తిగా వినియోగించుకోవడం వల్లే ఈ ఘనత సాధించానని విక్రమాన్ చెప్పుకొచ్చారు. కొన్ని కోర్సులు చేసేటప్పుడు ప్రారంభ దశలో ఎంతో కష్టంగా ఉండేదని.. తర్వాత ఒక్కో కోర్సు పూర్తిచేయడం వల్ల సులభతరమైందన్నారు.

Kerala man claims obtaining over 145 certificates
కుటుంబసభ్యులతో షఫీ విక్రమాన్

వెబినార్​లో పాల్గొనడం వల్ల తాను ఉచితంగా ఈ సర్టిఫికెట్లు సాధించగలిగానని, ఇన్ని కోర్సులను ఫీజు చెల్లించి చేయాలంటే ఎంతో ఖర్చు అయి ఉండేదన్నారు విక్రమాన్.

ఇదీ చూడండి: రూ.1000కి ఫేక్​ వ్యాక్సిన్ సర్టిఫికేట్​- నిందితుడు అరెస్ట్​

Last Updated : Jan 8, 2022, 1:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.