ETV Bharat / bharat

రాష్ట్రపతికి రక్తంతో లేఖ రాసిన పూజారులు

author img

By

Published : Aug 18, 2021, 10:18 AM IST

Updated : Aug 18, 2021, 10:52 AM IST

ఉత్తరాఖండ్​లోని కేదార్​నాథ్ ఆలయ పూజారులు ఆందోళన చేపట్టారు. దేవస్థానం బోర్డును రద్దు చేయాలని కోరుతూ.. రాష్ట్రపతి రామ్​నాథ్​​ కోవింద్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్​ సింగ్ థామికి రక్తంతో లేఖలు రాశారు.

kedarnath priests
రాష్ట్రపతికి రక్తంతో లేఖలు

కేదార్​నాథ్​ పూజారులు

కేదార్​నాథ్ దేవస్థానం బోర్డును రద్దు చేయాలని కోరుతూ.. ఆ ఆలయంలోని పూజారులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ థామికి రక్తంతో లేఖలు రాసి నిరసన తెలిపారు. దేవాలయంలోని ధమ్​ సాకేత్ బగాదీ, నితిన్ బగ్వాడీ పూజారులు.. రక్తంతో లేఖలు రాశారు. గతంలోనూ ఇలానే ప్రధాని మోదీకి రక్తంతో లేఖలు రాశారు పలువురు పురోహితులు.

రెండు నెలలుగా..

కేదార్​నాథ్ దేవస్థానం బోర్డును రద్దు చేయాలని దాదాపు రెండు నెలలుగా అర్చకులు ఆందోళన చేస్తున్నారు. బోర్డును ఏర్పాటు చేసినప్పటినుంచి తమ హక్కులకు భంగం కలుగుతోందన్నారు. బోర్డును రద్దు చేసేంతవరకూ ఆందోళనలు కొనసాగిస్తామన్నారు.

ఇదీ చదవండి: పోలీసుల ముందే లాయర్ల డిష్యుం డిష్యుం

Last Updated : Aug 18, 2021, 10:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.