ETV Bharat / bharat

స్డూడెంట్స్​కు గుడ్​న్యూస్- స్కూల్​ బ్యాగ్​ బరువు తగ్గించేందుకు సర్కార్​ కీలక నిర్ణయం!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 22, 2023, 12:40 PM IST

Karnataka School Book Weight Reduction
Karnataka School Book Weight Reduction

Karnataka School Book Weight Reduction : పాఠశాల విద్యార్థులకు కర్ణాటక ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారి పాఠశాల బ్యాగ్​ల బరువు తగ్గించడానికి నూతన విధానాన్ని అమలు చేయబోతోంది. ఇంతకీ ఆ కొత్త విధానం ఏంటంటే?

స్డూడెంట్స్​కు గుడ్​న్యూస్- స్కూల్​ బ్యాగ్​ బరువు తగ్గించేందుకు సర్కార్​ కీలక నిర్ణయం!

Karnataka School Book Weight Reduction : పాఠశాల విద్యార్థులకు కర్ణాటక ప్రభుత్వం శుభవార్త చెప్పింది. స్కూల్​ బ్యాగ్​ బరువును సగానికి తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి పాఠ్యపుస్తకాలను రెండు భాగాలుగా తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తోంది. ఫలితంగా ఆ అర్ధసంవత్సరానికి సంబంధించిన నిర్దిష్ట సిలబస్​ పాఠ్యపుస్తకాలను మాత్రమే విద్యార్థులు పాఠశాలకు తీసుకువెళ్తారు. ఈ నిర్ణయం ద్వారా విద్యార్థుల వెన్నెముకపై భారం తగ్గనుంది. అయితే బ్యాగ్ బరువు కారణంగా దాన్ని మోయలేక ఒక పిల్లవాడు కిందపడిపోతున్నట్లు ఒక వీడియో తనకెవరో పంపించారని కర్ణాటక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప తెలిపారు. ఆ వీడియోనే తనను ఈ నిర్ణయం తీసుకునేలా ప్రభావితం చేసిందని చెప్పారు.

Karnataka School Book Weight Reduction
బరువైన స్కూల్​ బ్యాగ్​లతో విద్యార్థులు

"నేను విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఒక చిన్న పిల్లవాడు బ్యాగ్‌ని మోసుకెళ్తున్న వీడియోను పిల్లల తల్లిదండ్రులు ఎవరో నాకు పంపించారు. దాని వల్ల నాకు ఈ ఆలోచన వచ్చింది. ఆ వీడియోలో పిల్లవాడు ఓ ఫుట్​పాత్​పై లేచి బ్యాగ్​ బరువు వల్ల వెనక్కి పడిపోతాడు. కానీ అదే పిల్లవాడు ప్రధాన రహదారిపై పడిపోతే? వారు మన పిల్లలు, మేము వారి కోసం సరైన భద్రతా చర్యలు తీసుకోవాలి"
-- మధు బంగారప్ప, కర్ణాటక విద్యాశాఖ మంత్రి

ఇలాంటి చర్యలు తీసుకోవాలని ఎంతో కాలం నుంచి పిల్లల తల్లిందండ్రులు పాఠశాలలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు పెద్ద ఉపశమనం కలిగినట్లైంది.

Karnataka School Book Weight Reduction
బరువైన స్కూల్​ బ్యాగ్​లతో విద్యార్థులు

"పుస్తకాలను రెండు భాగాలుగా విభజించడం చాలా మంచిది. తక్కువ బరువును మోసుకెళ్లడం వల్ల పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. దీనికి సంబంధించి ఆర్డర్​ జారీ చేయడం చాలా మంచిది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మేము ఏకీభవిస్తున్నాం"
-- ఇమ్రాన్ పాషా, పేరెంట్

"ఈ చర్య చాలా బాగుంది. చిన్నపిల్లలు బరువైన పుస్తకాలు మోయడం చాలా కష్టం. కావాల్సిన పుస్తకాలు తీసుకెళ్తే బాగుంటుంది. ఇలా రొటేషన్​ చేయడం కూడా బాగుంటుంది. బ్యాగ్​ బరువైతే పిల్లలు వెన్ను నొప్పితో బాధపడతారు"
-- రఘు, పేరెంట్

కర్ణాటక ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన నూతన విధానం వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలులోకి రానుంది. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.

School Bags : మీ పిల్లల స్కూల్​ బ్యాగ్​ బరువెంతో తెలుసా?.. నో స్కూల్​ బ్యాగ్​ డే అమలేది?

'పిల్లల స్కూల్​ బ్యాగ్​లు బరువుగా లేవులే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.