ETV Bharat / bharat

బాలిక ప్రాణం బలిగొన్న రూపాయి నాణెం

author img

By

Published : Sep 6, 2021, 1:01 PM IST

Updated : Sep 6, 2021, 7:24 PM IST

అనుకోకుండా రూపాయి నాణెం మింగి ఓ చిన్నారి మృతి చెందింది. దీనితో తల్లిదండ్రులు తీవ్ర దుఖంలో మునిగిపోయారు.

ఐదు
ఎక్స్​రే లో కనిపిస్తున్న ఐదు రూపాయల నాణెం

ఒక రూపాయి నాణెం మింగి చిన్నారి మరణించిన విషాద ఘటన కర్ణాటకలో(karnataka news) జరిగింది.

ఇదీ జరిగింది..

మైసూర్ జిల్లా(mysore latest news) హున్సూర్ తాలూకా అయరహళ్లి గ్రామానికి చెందిన ఖుషి అనే నాలుగేళ్ల చిన్నారి ఆమె తాతయ్య ఇంట్లో ఆడుకుంటోంది. అనుకోకుండా ఒక రూపాయి నాణాన్ని మింగింది. గమనించిన కుటుంబ సభ్యులు చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

అక్కడినుంచి మైసూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. శస్త్ర చికిత్స చేసి గొంతుల్లో ఇరుక్కుపోయిన నాణాన్ని బయటకు(throat opening surgery) తీయడానికి వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించింది. చికిత్స పొందుతూ చిన్నారి మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

ఐదు
ఎక్స్​రే లో కనిపిస్తున్న ఐదు రూపాయల నాణెం

అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ కూతురు మృతితో ఆసుపత్రిలో తల్లిదండ్రులు రోదించిన తీరు చూపరులకు కంటతడి పెట్టించింది.

ఇవీ చదవండి:

Last Updated : Sep 6, 2021, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.