ETV Bharat / bharat

'సాదాసీదాగా అంత్యక్రియలు.. స్మారక స్తూపం వద్దు'.. స్వామీజీ చివరి కోరిక.. సీఎం సహా వేల మంది భక్తులు హాజరు

author img

By

Published : Jan 3, 2023, 3:30 PM IST

Updated : Jan 3, 2023, 5:30 PM IST

కర్ణాటకలో నడిచే దేవుడిగా పేరుగాంచిన విజయపుర జ్ఞానయోగాశ్రమానికి చెందిన సిద్ధేశ్వర స్వామిజీ కన్నుమూశారు. అంతిమ దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఇప్పుడు నగరంలోని సైనిక్ స్కూల్ గ్రౌండ్స్‌లో అంతిమ దర్శనానికి ఏర్పాట్లు పూర్తి చేయగా, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అంతిమ దర్శనానికి వస్తున్నారు. అయితే మరణాంతరం తన దేహాన్ని దహనం చేయాలని తన చివరి వీలునామాలో రాశారు. ప్రభుత్వ లాంఛనాలతో ముఖ్యమంత్రి, కేంద్ర,రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, వేలాది భక్తుల ఆధ్వర్యంలో మంగళవారం స్వామీజీ అంత్యక్రియలు జరగనున్నాయి.

Etv Bharat
Etv Bharat

కర్ణాటకలో నడిచే దేవుడిగా పేరుగాంచిన సిద్ధేశ్వర స్వామిజీ

మరణాంతరం తనను ఖననానికి బదులు దహనం చేయండి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సిద్ధేశ్వర స్వామీజీ వీలునామా రాశారు. అస్తికలను నది లేదా సముద్రంలో కలపాలని చెప్పారు. అంత్యక్రియలను నిరాడంబరంగా జరిపించాలని సూచించారు. వీటితో పాటు భక్తులకు చివరి సందేశం కూడా ఇచ్చారు. 2014లో గురిపౌర్ణమి నాడు ఈ వీలునామా రాశారు సిద్ధేశ్వర స్వామీజీ.
సోమవారం సిద్ధేశ్వర స్వామీజీ కన్నుమూశారు.

siddeshwar swamiji death news
భక్తుల సందర్శన కోసం ఉంచిన సిద్ధేశ్వర స్వామిజీ పార్థివ దేహం

స్వామీజీ జీవిత సందేశం
"జీవితం అనేది అనుభవాల సమూహం. నిరంతర ఆలోచన, నిజాన్ని శోధించడం వల్ల అది పరిపూర్ణం అవుతుంది. ధర్మాన్ని పాటించడం వల్ల అది మీకు కలుగుతుంది. ఆత్మసంతృప్తికి అది ఒక కారణం. నాది ఓ సాధారణ జీవితం. గురుదేవ్​ దాన్ని సృష్టించారు. దాన్ని స్వీకరించినవారు ఈ దేశంలో ఉన్న గౌరవనీయ వ్యక్తులు. శ్రేయోభిలాషులు, దయా హృదయం కలిగిన వారు, సాధారణ వ్యక్తులు. ప్రకృతిలా నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీవితంలో నాకు లభించిన ప్రతిదానికీ నేను కృతజ్ఞుడ్ని. మబ్బులు కరగడం, పరదాలు తొలగిపోవడం, దీపాలు ఆరిపోవడం ఎలానో జీవితం కూడా ఓరోజు ఆగిపోతుంది. అనంతరం శూన్యం, నిశ్శబ్దం మాత్రమే మిగులుతాయి. దశాబ్దాలుగా బతకడంలో ఇసుమంతైనా నిజం లేదు. ఈ విషాయాన్ని నేను చూశాను, అనుభవించాను. నా జీవితం ఆగిపోయేముందు ఉవన్నీ కృతజ్ఞతతో గుర్తుతెచ్చుకోవాలి. అందుకే ఈ వీలునామా. ఈ లోకంలో నిజం, అబద్దం అనేది లేదు. సహజం, అసహజం అనేది లేదు. నేను నువ్వు అనే తేడా లేదు. అంత్యం ప్రణామాంజలి'' అని సందేశం ఇచ్చారు.

siddeshwar swamiji death news
సిద్ధేశ్వర స్వామిజీ చివరి వీలునామా
siddeshwar swamiji death news
సిద్ధేశ్వర స్వామిజీ చివరి వీలునామా

ప్రభుత్వ లాంఛనాలతో సిద్ధేశ్వర స్వామీజీ అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం జరగనున్నాయి. స్వామీజీ పార్థివ దేహాన్ని జ్ఞాన యోగాశ్రమంలో ఉంచారు. భక్తుల చివరి దర్శనం కోసం సైనిక్​ పాఠశాల పరిసరాలలోకి మార్చనున్నారు. ఈ అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మై, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా భక్తులు సంయమనం పాటించాలని సీఎం కోరారు.

Last Updated :Jan 3, 2023, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.