ETV Bharat / bharat

జాబ్​ స్కామ్ కేసులో.. కేంద్ర మంత్రి, మరో భాజపా ఎంపీపై కేసు

author img

By

Published : Jun 3, 2022, 12:05 PM IST

FIR on BJP MPs: బంగాల్​ భాజపా ఎంపీ జగన్నాథ్ సర్కార్​, కేంద్ర మంత్రి సుభాశ్ సర్కార్​పై ఎఫ్ఆర్ నమోదైంది. కొంతమందికి ఎయిమ్స్​లో వీరు అక్రమంగా ఉద్యోగాలు ఇప్పించారని సీఐడీ అభియోగాలు మోపింది.

FIR on BJP MPs
జాబ్​ స్కామ్ కేసులో భాజపా ఎంపీలపై కేసు

West bengal job scam: బంగాల్​లో ఇప్పటివరకు అధికార తృణమూల్ కాంగ్రెస్​ నేతలపైనే అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయితే తొలిసారి భాజపా నాయకులపై కేసు నమోదైంది. ఆ పార్టీ ఎంపీ జగన్నాథ్ సర్కార్​, కేంద్రమంత్రి సుభాశ్ సర్కార్​.. బంగాల్ కల్యాణీలోని ఎయిమ్స్​లో 8 మందికి అక్రమంగా ఉద్యోగాలు ఇప్పించారని రాష్ట్ర సీఐడీ అభియోగాలు మోపింది. ఎఫ్​ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

ఈ ఆరోపణలను ఎంపీ జగన్నాథ్ సర్కార్ ఖండించారు. ఇది టీఎంసీ కుట్ర అని, కావాలనే తమపై తప్పుడు ఆరోపణలు మోపుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు జరిగినా కేసులు నమోదు చేయట్లేదని, ప్రభుత్వం నీచ రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. టీఎంసీ నేతలు అవినీతిలో కూరుకు పోయారని, ఆ ఇమేజ్​ను మార్చుకునేందుకు భాజపా నేతలపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారని జగన్నాథ్ విమర్శించారు. ఉద్యోగాల నియామకాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్పారు. నిబంధనల ప్రకారమే ఎంపిక జరిగిందని పేర్కొన్నారు. ఈ కేసులో ఒకవేళ సీఐడీ తనను విచారణకు పిలిస్తే తప్పకుండా హజరవుతానని స్పష్టం చేశారు.

FIR on BJP MPs
జాబ్​ స్కామ్ కేసులో భాజపా ఎంపీలపై కేసు

అర్హులైన వారికే ఉద్యోగాలు ఇవ్వాలని కల్యాణీ ఎయిమ్స్ ఎదుట స్థానికులు కొద్ది నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. భాజపా ఎమ్మెల్యే బంకిం ఘోష్​ తన కోడలికి ఎయిమ్స్​లో అక్రమంగా ఉద్యోగం ఇప్పించారని అరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం 8 మందిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసింది బంగాల్ సీఐడీ. భాజపా ఎంపీలు జగన్నాథ్ సర్కార్​, సుభాశ్ సర్కార్​పై కూడా అభియోగాలు మోపింది.

ఇదీ చదవండి: భర్తను వదిలి 22 రోజులు సహజీవనం.. ఆపై బెదిరింపులు.. యువకుడి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.