ETV Bharat / bharat

DRDO news: బ్రహ్మోస్‌ రహస్యాలు లీకయ్యాయా?

author img

By

Published : Sep 18, 2021, 10:13 AM IST

DRDO news
బ్రహ్మోస్‌ రహస్యాలు లీకయ్యాయా?

డీఆర్​డీఓ (DRDO news) నుంచి రహస్యాల లీకులపై ఆందోళన వ్యక్తమవుతోంది. డీఆర్‌డీఓలో తయారు చేసిన అత్యాధునిక ఆయుధం బ్రహ్మోస్‌ (DRDO Brahmos) సంబంధిత రహస్యాలు కూడా లీక్‌ అయినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఆరోపణలపై ఇప్పటివరకు అయిదుగురిని అరెస్టు చేశారు.

ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లా చాందిపూర్‌ ఆయుధ పరిశోధన కేంద్రం డీఆర్‌డీఓ(DRDO news) నుంచి రహస్యాల లీకులపై ఆందోళన వ్యక్తమవుతోంది. మాజీ డీజీపీ బిపిన్‌ బిహారీ మిశ్రా శుక్రవారం.. భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడుతూ పాకిస్థాన్‌ గూఢచారి సంస్థ దేశంలోని శ్రీహరికోట, బాలేశ్వర్‌ ఆయుధ పరిశోధన కేంద్రాలను (Balasore DRDO) లక్ష్యంగా చేసుకుందన్నారు. అత్యాధునిక ఆయుధాల వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తోందన్నారు.

మరోవైపు పాకిస్థాన్‌కు ఆయుధాల రహస్యాలు పంపిన ఆరోపణలపై అధికారులు డీఆర్‌డీఓలో(DRDO news) పనిచేస్తున్న అయిదుగురిని అరెస్టు చేశారు. దీనిపై రాష్ట్ర క్రైం బ్రాంచ్‌, ఎన్‌ఐఏ దర్యాప్తు ప్రారంభించాయి. బాలేశ్వర్‌ పోలీసు ఉన్నతాధికారి తెలిపిన వివరాల మేరకు.. పట్టుబడిన ఐదుగురు సిబ్బందికి నేరుగా పాకిస్థాన్‌తో సంబంధం లేదు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒకవ్యక్తి మధ్యవర్తిగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. డీఆర్‌డీఓలో(DRDO Brahmos) తయారు చేసిన అత్యాధునిక ఆయుధం బ్రహ్మోస్‌ (Brahmos missile) సంబంధిత రహస్యాలు కూడా లీక్‌ అయినట్లు అనుమానిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వ్యక్తి రెండేళ్లలో రెండుసార్లు బాలేశ్వర్‌ వచ్చినట్లు నిర్ధరణ అయింది. అరెస్టయిన ఐదుగురిలో బసంత్‌ బెహర రహస్యాలు పంపించడంలో ప్రధాన పాత్ర పోషించాడు.

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వ్యక్తితో ఆయనకు సంబంధం ఉండేది. ఈ ఘటనలో పట్టుబడిన అయిదుగురే కాకుండా మరో ఇద్దరికి సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌లోకి సెల్‌ఫోన్లు తీసుకెళ్లడం నిషేధం. పట్టుబడిన ఉద్యోగులు అడ్డదారిలో సెల్‌ఫోన్లను లోపలికి తీసుకెళ్లి దాచి ఉంచేవారు. కొన్ని రహస్య డాక్యుమెంట్లు ఫొటోలు వాట్సప్‌లో మధ్యవర్తికి పంపించేవారు. ఆయన పాకిస్థాన్‌కు చేరవేసేవాడు. శుక్రవారం బాలేశ్వర్‌(Balasore DRDO) ఐజీ హిమాన్సులాల్‌ డీఆర్‌డీఓ రక్షణ బాధ్యతలో ఉన్న సీఎస్​ఓ ప్రధాన భద్రతా అధికారితో చర్చించారు.

ఇవీ చూడండి: ISIS Attack in India: భారత్​పై ఐసిస్ గురి- ఎన్ఐఏ హెచ్చరిక

తుపాకీ తూటాలకు బలైన ప్రేమికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.