ETV Bharat / bharat

'గగన్​యాన్ కోసం డేటా రిలే ఉపగ్రహ ప్రయోగం'

author img

By

Published : Apr 25, 2021, 5:46 PM IST

భారత్ చేపట్టబోయే మొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర(గగన్​యాన్)తో సంబంధం నెరపుతూ.. సహాయపడడానికి డేటా రిలే ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించనుంది. గగన్​యాన్ ఆఖరి దశ ప్రయోగం కంటే ముందే ఈ ఉపగ్రహాన్ని పంపనున్నట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి.

ISRO
ఇస్రో

అంతరిక్షంలోకి మానవులను పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్ధ ఇస్రో చేపట్టనున్న గగన్‌యాన్‌ ప్రాజక్టు నిర్వహణలో మరింత సాయం చేసేలా ఇస్రో మరో ఉపగ్రహ ప్రయోగం జరపనుంది. గగన్‌యాన్‌ ప్రాజక్టులో భాగంగా రోదసిలోకి పంపే ఉపగ్రహాల నుంచి సమాచారాన్ని భూమికి చేరవేసేందుకు మరో ఉపగ్రహాన్ని ఇస్రో నింగిలోకి పంపనుంది.

రూ.800 కోట్లతో చేపట్టిన గగన్‌యాన్‌ ప్రాజక్టులో మానవ సహిత ఉపగ్రహాన్ని ఇస్రో 2023లో ప్రయోగించనుండగా, మానవ రహిత ఉపగ్రహాన్ని 2021 డిసెంబర్‌లో రోదసిలోకి పంపనుంది. అంతకు ముందే ఇస్రో సమాచార ఉపగ్రహ ప్రయోగాన్ని చేపట్టనుంది. సాధారణంగా కక్ష్యలో ఉండే ఉపగ్రహాలకు భూమి మీద ఉన్న అంతరిక్ష కేంద్రం సరిగా కనిపించకుంటే సమాచారాన్ని అక్కడకు పంపలేవు. ఈ సమస్యను అధిగమించేందుకు ఇస్రో సమాచార ఉపగ్రహాన్ని పంపనుంది.

గగన్‌యాన్‌ ప్రయోగంలో ప్రయోగించే ఉపగ్రహాల నుంచి సమాచారాన్ని భూమికి చేరవేయడంలో ఇది సాయం చేస్తుంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు ఇలాంటి సొంత సమాచార ఉపగ్రహం ఉంది. భూమి మీద అదనంగా ఎలాంటి అంతరిక్ష కేంద్రాలను ఏర్పాటు చేయకుండానే ప్రపంచంలోని అన్ని ఉపగ్రహాల కదలికలను ఇది నిరంతరం గమనిస్తూ ఉంటుంది.

ఇదీ చదవండి: గగన్​యాన్ వ్యోమగాములకు రష్యాలో శిక్షణ పూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.