ETV Bharat / bharat

సమాజ్‌వాదీ పార్టీలోకి పొడవైన వ్యక్తి ధర్మేంద్ర

author img

By

Published : Jan 24, 2022, 6:28 AM IST

India's Tallest Man: ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ క్రమంలో దేశంలో అత్యంత పొడగరి వ్యక్తిగా గుర్తింపు పొందిన యూపీకి చెందిన ధర్మేంద్ర ప్రతాప్‌ సింగ్‌ సమాజ్‌వాదీ పార్టీలో చేరారు.

Dharmendra Pratap singh
ధర్మేంద్ర ప్రతాప్‌ సింగ్‌

India's Tallest Man: దేశంలో అత్యంత పొడగరి వ్యక్తిగా గుర్తింపు పొందిన యూపీకి చెందిన ధర్మేంద్ర ప్రతాప్‌ సింగ్‌ సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరేష్‌ ఉత్తమ్‌ పటేల్‌ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ధర్మేంద్ర ప్రతాప్‌ రాకతో రాబోయే ఎన్నికల్లో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఈ సందర్భంగా నరేష్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. సమాజ్‌వాదీ విధానాలు నచ్చి ఆయన చేరారని పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌధరి తెలిపారు. పార్టీ అధినేత అఖిలేష్‌తో దిగిన చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది.

ఏ పార్టీతో సంబంధంలేని ధర్మేంద్ర ప్రతాప్‌ తొలిసారి రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. పొడవైన వ్యక్తిగా ఆయకున్న క్రేజ్‌ను సమాజ్‌ వాదీ పార్టీ సైతం ప్రచారంలో వినియోగించుకోవాలని భావిస్తోంది. మరోవైపు తన జీవితంలో తనను ఇబ్బంది పెట్టింది ఏదైనా ఉంటే అది తన పొడవు మాత్రమేనని, అదే తనకు ప్రత్యేక గుర్తింపు కూడా తెచ్చిందని ధర్మేంద్ర ప్రతాప్‌సింగ్‌ తెలిపారు. తాను బయట అడుగు పెడితే సెల్ఫీలు తీసుకోవడానికి ప్రజలు ఎగబడుతుంటారని చెప్పారు. ప్రతాప్‌గఢ్‌కు చెందిన ప్రతాప్‌ సింగ్‌ పొడవు 8 అడుగుల 1 అంగుళాలు. ప్రపంచ రికార్డు కలిగిన వ్యక్తి కంటే 11 సెంటీమీటర్లు తక్కువ పొడవు ఉన్న ప్రతాప్‌ సింగ్‌ దేశంలోని అత్యంత పొడవైన వ్యక్తిగా గుర్తింపు పొందారు.

ఇదీ చదవండి:

Goa assembly Polls: గోవాలో మళ్లీ సంకీర్ణమేనా? కింగ్​మేకర్​ ఎవరు?

ఎస్పీకి ములాయం కుటుంబ సభ్యుల గుడ్​బై- అఖిలేశ్​కే లాభమా?

UP polls 2022: యువతకు అఖిలేశ్​​ ఆఫర్​.. ఐటీ​లో 22 లక్షల ఉద్యోగాలకు హామీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.