ETV Bharat / bharat

రూ.22వేల కోట్లతో అమెరికా డ్రోన్లు.. త్వరలో డీఏసీ ఆమోదం!

author img

By

Published : Nov 17, 2021, 6:28 AM IST

త్రివిధ దళాలకు ఉపయోగపడేలా దాాదాపు రూ.22,000కోట్ల విలువైన 30 సాయుధ డ్రోన్​లను అమెరికా నుంచి కొనుగోలు చేసే ప్రతిపాదన త్వరలో కొలిక్కి రానుంది. డ్రోన్​ల కొనుగోలు ప్రతిపాదనలను రక్షణ సంబంధిత కొనుగోళ్ల మండలి(డీఏసీ) అనుమతించనుంది.

Predator drone
అమెరికా డ్రోన్లు

అమెరికా నుంచి ఆధునాతన డ్రోన్ల కొనుగోలుకు సంబంధించి సుదీర్ఘ ప్రతిపాదన తుది దశకు చేరినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దాదాపు 22 వేల కోట్ల విలువైన 30 మల్టీ మిషన్ సాయుధ డ్రోన్​ల కొనుగోలు ప్రతిపాదనలను రక్షణ సంబంధిత కొనుగోళ్ల మండలి(డీఏసీ) అనుమతించనుంది.

డీఏసీ ఆమోదం తర్వాత.. ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ ఆమోదించాక డ్రోన్ల కొనుగోలు ప్రతిపాదన ఖరారు కానుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 30 డ్రోన్లలో త్రివిద దళాలు 10చొప్పున తీసుకోనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

గాల్లోనే 35గంటలు..

ఈ డ్రోన్లు శత్రుదేశాల లక్ష్యాలను ధ్వంసం చేయడంతో పాటు వైమానిక దాడులను తిప్పికొడతాయి. రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేసే ఈ ఆధునాతన డ్రోన్లకు నిరంతరాయంగా దాదాపు 35 గంటల పాటు ఆకాశంలో గస్తీ కాసే సామర్థ్యం ఉంది.

కొంతకాలంగా జమ్ముకశ్మీర్ లో పాక్ డ్రోన్ల దాడికి పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ఆధునాతన డ్రోన్ల కొనుగోలుకు భారత రక్షణశాఖ చాలాకాలం నుంచి ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

భారత్​కు 'ఎస్​ 400'పై అమెరికా ఆందోళన..

అధునాతన ఎస్​ 400క్షిపణి రక్షణ వ్యవస్థల్ని భారత్​కు సరఫరా చేసేందుకు రష్యా నిర్ణయించడంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై ఏంచేయాలో ఇంకా నిర్ణయించుకోలేదని పెంటగాన్ సీనియర్ అధికారి తెలిపారు. భారత్​పై ఆంక్షలేమైనా విధిస్తారా? అనేది జో బైడెన్ సర్కార్​ ఇంతవరకు స్పష్టం చేయలేదు.

ఇదీ చూడండి: 'సంపద'లో అమెరికాను దాటేసిన చైనా- షాకింగ్ లెక్కలివే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.