ETV Bharat / bharat

Covid 19 india: దేశంలో కొత్తగా 38,079 కరోనా కేసులు

author img

By

Published : Jul 17, 2021, 9:30 AM IST

Updated : Jul 17, 2021, 10:33 AM IST

దేశంలో కొత్తగా 38,079 కరోనా కేసులు(covid 19 india) నమోదయ్యాయి. మరో 560 మంది మృతి చెందారు.

covid cases in india
దేశంలో కరోనా కేసులు

భారత్​లో కరోనా మహమ్మారి వ్యాప్తి(covid 19 india) తగ్గుముఖం పడుతోంది. కొత్తగా.. 38,079 మందికి వైరస్​ సోకింది. వైరస్ బారిన పడి మరో 560 మంది ప్రాణాలు విడిచారు. క్రియాశీల రేటు 1.39 శాతానికి తగ్గగా.. రికవరీరేటు 97.31 శాతానికి పెరిగింది.

  • మొత్తం కేసులు: 3,10,64,908
  • మొత్తం మరణాలు: 4,13,091
  • కోలుకున్నవారు: 3,02,27,792
  • యాక్టివ్​ కేసులు: 4,24,025
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

వ్యాక్సినేషన్:

దేశంలో ఇప్పటివరకు 39,96,95,879 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ​ వెల్లడించింది. శుక్రవారం ఒక్కరోజే 42,12,557 డోసులు అందించినట్లు తెలిపింది.

శుక్రవారం ఒక్కరోజే 19,98,715 కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్​ పేర్కొంది.

ప్రపంచంలో కొవిడ్​ కేసులు..

మరోవైపు.. డెల్టా వైరస్​ విజృంభణతో వివిధ దేశాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. బ్రెజిల్​లో అత్యధికంగా ఒక్కరోజే 45,591 మందికి పాజిటివ్​గా తేలగా.. అమెరికాలో 40,529 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది.

ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 562,570 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. 8,653 మంది చనిపోయారు. కాగా 347,645 మంది కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 190,270,626గా ఉంది.

కొత్త కేసులు...

  • అమెరికా - 40,529
  • బ్రెజిల్​ - 45,591
  • ఫ్రాన్స్​ - 10,908
  • రష్యా - 25,704
  • యూకే- 51,870

ఇవీ చూడండి:

Last Updated : Jul 17, 2021, 10:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.