ETV Bharat / bharat

Corona cases in India: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

author img

By

Published : Oct 1, 2021, 9:46 AM IST

Corona cases in India
భారత్​లో కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు(Coronavirus update) మళ్లీ పెరిగాయి. కొత్తగా 26,727 మంది​కి కొవిడ్​​​ (Covid cases in India) సోకింది. మరో 277 మంది మృతి చెందారు. ఒక్కరోజే 28,246 మంది వైరస్​ను జయించారు.

భారత్​లో రోజువారీ కొవిడ్​​ కేసులు (Coronavirus update) మళ్లీ పెరిగాయి. గురువారం ఒక్కరోజే 26,727 మంది​ (Covid cases in India) వైరస్​ బారిన పడ్డారు. మరో 277 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 28,246 మంది కరోనాను జయించారు.

  • మొత్తం కేసులు: 33,766,707
  • మొత్తం మరణాలు: 4,48,339
  • మొత్తం కోలుకున్నవారు: 3,30,43,144
  • యాక్టివ్ కేసులు: 2,75,224

దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో.. ఒక్క కేరళలోనే 15,914 కేసులు(Kerala Corona Update) వెలుగు చూశాయి. మరో 122 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ కొవిడ్​ కేసులు బయటపడుతున్నాయి.

టెస్టులు

గురువారం ఒక్కరోజే 15,20,899 కొవిడ్​ ​టెస్టులు(Testing update for covid-19) నిర్వహించినట్లు ఐసీఎంఆర్​ తెలిపింది. దీంతో మొత్తం కొవిడ్​ పరీక్షల సంఖ్య 57,04,77,338కి చేరింది.

వ్యాక్సినేషన్​

దేశంలో ఇప్పటివరకు 89,02,08,007 టీకా డోసులను(covid vaccination) పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. సెప్టెంబర్​ 29న 64,40,451 వ్యాక్సిన్​ డోసులను లబ్దిదారులకు అందించినట్లు తెలిపింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రపంచవ్యాప్తంగా

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి (Global corona virus update) కొనసాగుతోంది. కొత్తగా 4,88,487 మందికి కరోనా (Corona update) పాజిటివ్​గా తేలింది. వైరస్​ ధాటికి 7,815 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23,45,59,779కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 47,97,310కి పెరిగింది.

ఆయా దేశాల్లో కొత్త కేసులు..

  • అమెరికా - 1,13,922
  • బ్రిటన్ - 36,480
  • టర్కీ - 29,104
  • రష్యా - 23,888
  • బ్రెజిల్ - 27,527
  • ఇరాన్ - 14,078

ఇదీ చూడండి: గర్భస్థ శిశువులపై కాలుష్య కాటు- నెలలు నిండకముందే జననం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.