ETV Bharat / bharat

Coronavirus India: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

author img

By

Published : Nov 11, 2021, 10:08 AM IST

india corona cases
కరోనా కేసులు

భారత్​లో కరోనా కేసులు (India covid cases) స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 13,091 మందికి కరోనా (Coronavirus India) సోకింది. వైరస్​ ధాటికి మరో 340 మంది మరణించారు.

దేశం​లో కొవిడ్​ కేసుల సంఖ్య (India covid cases) స్వల్పంగా పెరిగింది. తాజాగా 13,091 మందికి కొవిడ్​ పాజిటివ్​గా(Corona cases in India) తేలింది. కరోనా కారణంగా (Coronavirus India)​ మరో 340 మంది బలయ్యారు.

  • మొత్తం మరణాలు: 4,62,189
  • యాక్టివ్​ కేసులు: 1,38,556
  • కోలుకున్నవారు: 3,38,00,925

టీకాల పంపిణీ​..

దేశంలో కొవిడ్​ టీకా పంపిణీ (Vaccination in India) జోరుగా కొనసాగుతోంది. బుధవారం ఒక్కరోజే 57,54,817 డోసుల వ్యాక్సిన్​ అందించారు. ఫలితంగా మొత్తం టీకా డోసుల పంపిణీ 1,10,23,34,225కి చేరింది.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా రోజువారి కరోనా​ కేసుల్లో (coronavirus worldwide) పెరుగుదల నమోదైంది. కొత్తగా 5,36,256 మందికి కొవిడ్​​ (Corona update) సోకింది. కరోనా​ ధాటికి 7,874 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 25,21,03,318 కు చేరింది. మొత్తం మరణాలు 50,87,705కి చేరాయి.

వివిధ దేశాల్లో కొత్త కేసులు..

  • అమెరికాలో కొవిడ్​ కేసులు భారీగా పెరిగాయి. 94,376 మందికి వైరస్​ సోకింది. మరో 1,493 మంది చనిపోయారు.
  • రష్యాలో మరో 38,058 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. ఒక్కరోజే 1,239 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రిటన్​లో కొత్తగా 39,329 మందికి వైరస్​​ బారినపడ్డారు. మరో 214 మంది మృతి చెందారు.
  • టర్కీలో కొత్తగా 27,259 కరోనా​ కేసులు నమోదవగా.. 203 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జర్మనీలో కొత్తగా మరో 45,416 మందికి కొవిడ్ సోకింది. 244 మంది మరణించారు.

ఇదీ చదవండి:Corona cases: కేరళలో మరో 7వేల మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.