ETV Bharat / bharat

కరోనా మారణహోమం- 3లక్షలు దాటిన మృతులు

author img

By

Published : May 24, 2021, 9:34 AM IST

Updated : May 24, 2021, 10:15 AM IST

దేశంలో కొవిడ్​ మరణాలు మరోసారి పెరిగాయి. ఆదివారం మరో 4,454 మంది కొవిడ్​కు బలయ్యారు. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య మూడు లక్షల మార్క్​ను దాటింది. కొత్తగా 2.22 లక్షల మంది వైరస్​ బారినపడ్డారు.

Corona, Covid-19
కరోనా, కొవిడ్​-19

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గినా.. మారణహోమం మాత్రం కొనసాగుతూనే ఉంది. కొత్తగా 2,22,315 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మహమ్మారి సోకిన వారిలో ఆదివారం ఒక్కరోజే 4,454 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య మూడు లక్షల మార్క్​ను దాటింది.

ఇదీ చదవండి: భారత్​లో కరోనా.. అంకెల్లో ఇలా...

  • మొత్తం కేసులు: 2,67,52,447‬
  • ‬మొత్తం మరణాలు: 3,03,720
  • కోలుకున్నవారు: 2,37,28,011
  • యాక్టివ్ కేసులు: 27,20,716
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: భారత్​లో 2% కాదు.. 24% మందికి కరోనా!

వైరస్​ బారినపడిన వారిలో 3,02,544 మంది కోలుకున్నారు. దేశవ్యాప్త రికవరీ రేటు 88.69 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.14 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ఇదీ చదవండి: టీకా సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

33 కోట్లు దాటిన పరీక్షలు

దేశవ్యాప్తంగా ఆదివారం 19,28,127 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది. దీంతో మొత్తం టెస్ట్​ల సంఖ్య 33 కోట్ల 5 లక్షల 36 వేల 64కు చేరింది.

ఇదీ చదవండి: జ్వరం టీకాతోనా?.. వైరస్‌వల్లా?

వ్యాక్సినేషన్​

కరోనా కట్టడిలో భాగంగా తాజాగా.. 9 లక్షల 42 వేల 722 లక్షల డోసుల టీకాలు వేసినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు 19 కోట్ల 60 లక్షల 51 వేల 962 టీకా డోసులు పంపిణీ చేసినట్టు పేర్కొంది.

ఇదీ చదవండి: ఒకే వ్యక్తికి వేర్వేరు టీకాలు ఇవ్వొచ్చా?

Last Updated : May 24, 2021, 10:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.