ETV Bharat / bharat

దేశంలో మరో 13,993 కేసులు, 101 మరణాలు

author img

By

Published : Feb 20, 2021, 9:43 AM IST

దేశంలో కొత్తగా 13,993 మంది వైరస్​ బారినపడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 1కోటీ 9లక్షల 77వేల 387కు చేరింది. శుక్రవారం ఒక్కరోజే 10,307 మంది మహమ్మారిని జయించారు.

INDIA REGISTERED 13,993 NEW COVID-19 POSITIVE CASES AND 101 DEATHS IN LAST 24 HOURS
దేశంలో మరో 13,993 కేసులు.. 101 మరణాలు

దేశంలో గురువారంతో పోల్చితే శుక్రవారం రోజు కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. తాజాగా 13,993 మందికి వైరస్​​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మరో 101 మంది వైరస్​కు బలవ్వగా.. మొత్తం మరణాల సంఖ్య 1లక్షా 56వేల 212కు చేరింది.

  • మొత్తం కేసులు: 1,09,77,387
  • మరణాలు: 1,56,212
  • రికవరీల సంఖ్య: 1,06,78,048
  • యాక్టివ్​ కేసులు: 1,43,127

కొవిడ్​ బారినపడిన వారిలో 10,307 మంది కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 97.27 శాతానికి తగ్గింది. మరణాల రేటు స్థిరంగా 1.42 శాతంగా ఉంది.

అటు.. శుక్రవారం ఒక్కరోజే 7లక్షల 86వేల 618 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది. దీంతో మొత్తం టెస్ట్​ల సంఖ్య 21.02 కోట్లు దాటింది.

దేశవ్యాప్తంగా మరో 5.27 లక్షల మందికి కొవిడ్​ టీకా అందించినట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. ఫలితంగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య 1కోటీ 7లక్షలు దాటిందని పేర్కొంది.

ఇదీ చదవండి: టీకా పంపిణీలో కోటి మార్కును దాటిన భారత్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.