ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా మరో 13,083 కరోనా కేసులు

author img

By

Published : Jan 30, 2021, 10:01 AM IST

INDIA REGISTERED 13,083 NEW COVID-19 POSTIVE CASES AND 137 DEATHS IN LAST 24 HOURS
దేశవ్యాప్తంగా మరో 13,083 మందికి కరోనా

దేశంలో కరోనా కేసులు మరోసారి భారీగా తగ్గాయి. కొత్తగా 13,083 మంది కొవిడ్​ బారినపడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 1కోటీ 7లక్షల 33వేలకు చేరింది. దేశవ్యాప్త రికవరీ రేటు 96.98 శాతంగా నమోదైంది.

దేశంలో కొవిడ్​-19 కేసుల సంఖ్య క్రితం రోజుతో పోల్చితే భారీగా తగ్గింది. శుక్రవారం ఒక్కసారిగా పెరుగుదల కనిపించినప్పుటికీ..మళ్లీ 14వేల దిగువకు చేరుకున్నాయి. ఇవాళ కొత్తగా 13,083 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. మరో 137 మంది మహమ్మారికి బలయ్యారు.

  • మొత్తం కేసులు: 1,07,33,131
  • యాక్టివ్ కేసులు: 1,69,824
  • కోలుకున్నవారు: 1,04,91,160
  • మొత్తం మరణాలు: 1,54,147

తాజాగా 14,808 మంది వైరస్​ను జయించారని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. ఫలితంగా దేశవ్యాప్త రికవరీ రేటు 96.98 శాతానికి పెరగ్గా.. మరణాల రేటు స్థిరంగా 1.44 శాతంగా నమోదైంది.

దేశవ్యాప్తంగా మరో 7లక్షల 56ల 329 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) వెల్లడించింది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 19కోట్ల 58లక్షలకు చేరింది.

35 లక్షలు దాటిన టీకా లబ్ధిదారులు..

మరోవైపు.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగంగా సాగుతోంది. శుక్రవారం ఒక్కరోజే 5.7 లక్షల మందికి టీకా అందించినట్టు తెలిపింది ఆరోగ్యశాఖ. ఇప్పటివరకు సుమారు 35 లక్షల మందికి వ్యాక్సిన్​ పంపిణీ చేసినట్టు పేర్కొంది.

ఇదీ చదవండి: మహమ్మారిపై ముప్పేట దాడి!- దేశంలో కొవిడ్‌కు ఏడాది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.