ETV Bharat / bharat

'2024 నాటికి భారత్​లో  1000మందికి ఒక వైద్యుడు'

author img

By

Published : Aug 10, 2021, 9:35 AM IST

vk paul
వీకే పాల్​

గత 75 ఏళ్లలో భారత్​ ఆరోగ్యరంగంలో గణనీయమైన పురోగతి సాధించినట్లు నీతి ఆయోగ్​ సభ్యుడు వినోద్​ పాల్ తెలిపారు. ప్రతి 1000మందికి ఒక వైద్యుడు ఉండాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు త్వరలోనే సాకారం కానున్నట్లు పేర్కొన్నారు.

భారత్​లో వైద్య, ఆరోగ్య రంగంలో గణనీయమైన మార్పులు రానున్నట్లు నీతి ఆయోగ్​ సభ్యుడు వినోద్​పాల్​ అన్నారు. దేశంలోని ప్రతి 1000మందికి ఓ వైద్యుడు ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన లక్ష్యాన్ని 2024 నాటికి తప్పకుండా అందుకోగలమని ధీమా వ్యక్తం చేశారు. అంతేగాకుండా ఆసుపత్రి పడకల సంఖ్యను 11లక్షల నుంచి 22 లక్షలకు పెంచుతున్నట్లు పేర్కొన్నారు.

గడిచిన 75ఏళ్లలో దేశ ఆరోగ్య రంగంలో గణనీయమైన పురోగతి సాధించినట్లు తెలిపారు. స్వాతంత్య్రం వచ్చే నాటికి భారతీయుల సగటు జీవిత కాలం కేవలం 28 సంవత్సరాలు మాత్రమేని చెప్పిన ఆయన ప్రస్తుతం అది 70 ఏళ్లకు పెరిగినట్లు గుర్తు చేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్​ నిర్వహించిన 'అజాదీ కా అమృత్​ మహోత్సవ్​' అనే వర్చువల్​ మీటింగ్​లో ప్రసంగించారు.

ప్రజారోగ్యానికి సంబంధించి భారత్​ నిర్దేశించుకున్న లక్ష్యాలను ఇంకా చేరలేదు. అవి ఇప్పటికీ పెద్ద సవాలుగానే ఉంది. గత ఆరేడేళ్లుగా ఈ సమస్యలను పరిష్కరించడానికి మేము చాలా చర్యలు తీసుకున్నాము. అందుకు తగ్గట్టుగానే ఫలితాలు ఉన్నాయి.

- వినోద్​పాల్​, నీతి ఆయోగ్​ సభ్యుడు

ప్రజలకు కావాల్సిన అన్ని రకాల ఆరోగ్య అవసరాలను తీర్చే విధంగా ఆయుష్మాన్ భారత్ యోజన, జన్ ఆరోగ్య యోజనలు ఉన్నాయని పాల్​ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: బడిగంట మోగక ముందే.. పిల్లలకు సురక్షిత టీకాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.