ETV Bharat / bharat

106+ ఏజ్​లో మళ్లీ ఓటు వేసేందుకు సిద్ధం.. పోలింగ్ బూత్​లో రెడ్​ కార్పెట్​ వెల్​కమ్​

author img

By

Published : Oct 31, 2022, 4:11 PM IST

హిమాచల్ ​ప్రదేశ్​కు చెందిన 106 ఏళ్ల శ్యాం సరన్​ నేగి.. మరోసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. వృద్ధాప్యం కారణంగా ప్రభుత్వం ఆయనకు పోస్టల్​ బ్యాలెట్​ సదుపాయం కల్పించినా.. నేగి నిరాకరించారు. తాను స్వయంగా పోలింగ్​ బూత్​కు వెళ్లే ఓటు వేస్తానని స్పష్టం చేశారు. పోలింగ్​ కేంద్రంలో ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలకనున్నారు.

Red carpet welcome for 'Master Ji' as he returns 12-D form
Red carpet welcome for 'Master Ji' as he returns 12-D form

Himachal Pradesh Elections 2022 : దేశంలోనే అత్యధిక వయస్కుడైన ఓటరుగా రికార్డు నమోదు చేసిన హిమాచల్​ ప్రదేశ్​కు చెందిన 106 ఏళ్ల శ్యాం సరన్​ నేగి.. మరోసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. వృద్ధాప్యం కారణంగా ప్రభుత్వం ఆయనకు పోస్టల్​ బ్యాలెట్​ సదుపాయం కల్పించినా.. నేగి నిరాకరించారు. తాను స్వయంగా పోలింగ్​ బూత్​కు వెళ్లే ఓటు హక్కు వినియోగించుకుంటానని స్పష్టం చేశారు.

కిన్నౌర్​ జిల్లా ఎన్నికల సంఘం అధికారులు.. 12-డి ఫారాన్ని తీసుకుని నేగి ఇంటికి వెళ్లారు. పోస్టల్ బ్యాలెట్​ ద్వారా ఆయన ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఆయన 12-డి ఫారాన్ని తిరిగి ఎన్నికల అధికారులకే ఇచ్చేశారు. తాను పోలింగ్​ బూత్​కు వెళ్లి మాత్రమే ఓటు వేస్తానని తెలిపారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి అబిద్ హుస్సేన్​ తెలిపారు. నవంబరు 12వ తేదీన నేగిని ప్రత్యేక వాహనంలో పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. అక్కడ ఎర్ర తివాచీతో ఘన స్వాగతం పలకనున్నట్లు వెల్లడించారు.

First Voter Of India : దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1951లో జరిగిన తొలి లోక్​సభ ఎన్నికల్లో ఓటేశారు శ్యాం. ఆ సమయంలో ఆయన పాఠశాల ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఓటు వేసి ఆ తర్వాత తన విధులకు హాజరయ్యారు. అప్పటి నుంచి లోక్​సభ, అసెంబ్లీ, పంచాయతీ రాజ్​ ఎన్నికల కలిపి మొత్తం 32 సార్లు ఓటేసి యువతరానికి ఆదర్శంగా నిలిచారు. అందుకే ఆయన భారతీయ ప్రజాస్వామ్య 'లివింగ్ లెజెండ్'గా పేరొందారు. తన చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఓటు ప్రాముఖ్యాన్ని వివరించి మరీ ఓట్లు వేయించేవారు.

Postal Ballet : 80 ఏళ్లు పైబడిన వారికి పోస్టల్​ బ్యాలెట్​ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే సదుపాయాన్ని ఎన్నికల శాఖ ప్రారంభించింది. 80 ఏళ్లు దాటిన ఓటర్లు ఇంటి నుంచే ఓటు వేయవచ్చు. దివ్యాంగులకు, కొవిడ్​ బాధితులకు కూడా పోస్టల్​ బ్యాలెట్​ సదుపాయం వర్తిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.