ETV Bharat / bharat

Corona cases in India: 527రోజుల కనిష్ఠానికి కరోనా యాక్టివ్ కేసులు

author img

By

Published : Nov 17, 2021, 9:47 AM IST

Updated : Nov 17, 2021, 10:26 AM IST

భారత్​లో కొత్తగా 10,197 కరోనా కేసులు (India covid cases) నమోదయ్యాయి. వైరస్​ ధాటికి మరో 301 మంది మరణించారు. మరోవైపు.. జమ్ముకశ్మీర్​లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూ విధించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

covid cases
కరోనా కేసులు

దేశం​లో కొవిడ్​ కేసుల సంఖ్య (India covid cases) స్వల్పంగా తగ్గింది. తాజాగా 10,197 మందికి కొవిడ్​ పాజిటివ్​గా(Corona cases in India) తేలింది. కరోనా (Coronavirus India)​ ధాటికి మరో 301 మంది మృతి చెందారు. యాక్టివ్ కేసులు 527రోజుల కనిష్ఠానికి పడిపోయాయి.

  • మొత్తం కేసులు: 3,44,66,598‬
  • మొత్తం మరణాలు: 4,64,153
  • యాక్టివ్​ కేసులు: 1,28,555
  • కోలుకున్నవారు: 3,38,73,890‬

జమ్ములో నైట్ కర్ఫ్యూ..

జమ్ముకశ్మీర్​లో కొవిడ్ పాజిటివిటీ రేటు పెరుగుతున్నందున బుధవారం నుంచి.. రాత్రిపూట కర్ఫ్యూ విధించనున్నట్లు ప్రభుత్వ యంత్రాంగం ప్రకటించింది. కరోనా నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జమ్ము మేజిస్ట్రేట్ అన్షుల్ గార్గ్ హెచ్చరించారు. కర్ఫ్యూ నిబంధనలపై అధికారులంతా ప్రజలకు అవగాహన కల్పించాలని మేజిస్ట్రేట్ కార్యాలయం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

'ఇటీవల పాజిటివిటీ రేటు 0.2 శాతం పెరిగింది. మహమ్మారిని అరికట్టేందుకు తక్షణ చర్యలు అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాం' అని జిల్లా పాలనాధికారి తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కరోనా​ కేసుల్లో (coronavirus worldwide) పెరుగుదల నమోదైంది. కొత్తగా 4,98,430 మందికి కొవిడ్​​ (Corona update) సోకింది. కరోనా​ ధాటికి 7,485 మంది మృతి చెందారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 255,098,687కు చేరింది. మొత్తం మరణాలు 5,129,829కి చేరాయి.

వివిధ దేశాల్లో కొత్త కేసులు..

  • అమెరికాలో కొవిడ్​ కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 87,133 మందికి వైరస్​ సోకింది. మరో 1,282 మంది చనిపోయారు.
  • రష్యాలో మరో 36,818 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. ఒక్కరోజే 1,240 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రిటన్​లో కొత్తగా 37,243 మందికి వైరస్​​ బారినపడ్డారు. మరో 214 మంది మృతి చెందారు.
  • టర్కీలో కొత్తగా 25,101 కరోనా​ కేసులు నమోదవగా.. 227 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • జర్మనీలో కొత్తగా మరో 39,985 మందికి కొవిడ్ సోకింది. 299 మంది మరణించారు.

ఇవీ చదవండి:

Last Updated :Nov 17, 2021, 10:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.