ETV Bharat / bharat

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. జపాన్​లో 2లక్షల మందికి వైరస్

author img

By

Published : Aug 8, 2022, 9:21 AM IST

Updated : Aug 8, 2022, 9:42 AM IST

Etv Bharat
Etv Bharat

Covid Cases In India: భారత్​లో కొవిడ్​ కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా 16,167 మంది వైరస్ బారిన పడ్డారు. 41 మంది మృతి చెందారు. మరోవైపు జపాన్​లో మరోసారి 2 లక్షలకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి.

Covid Cases in India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం మధ్య 16,167 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. 41 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 6.14 శాతంగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో కొవిడ్​ నుంచి 15,549 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.50 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.31 శాతంగా ఉన్నాయి.

  • మొత్తం మరణాలు: 5,26,730
  • మొత్తం కేసులు: 4,41,61,899
  • యాక్టివ్​ కేసులు: 1,35,510
  • కోలుకున్నవారి సంఖ్య: 4,34,99,659

Vaccination India:
భారత్​లో ఆదివారం 34,75,330 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 206.56 కోట్లు దాటింది. మరో 2,63,419 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Covid Cases: ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 5,56,051 మంది వైరస్​ బారినపడగా.. మరో 780 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 58,93,03,819కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 64,36,397 మంది మరణించారు. ఒక్కరోజే 7,25,654 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 56,05,29,650కు చేరింది.

  • జపాన్​లో కరోనా బీభత్సం కొనసాగుతోంది. కొత్తగా 2,14,879 కేసులు నమోదయ్యాయి. 161 మంది మరణించారు.
  • దక్షిణ కొరియాలో లక్షకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. 27 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఇటలీలో 26,656 కేసులు నమోదయ్యాయి. 74 మంది మరణించారు.
  • ఆస్ట్రేలియాలో 22,616 కేసులు నమోదయ్యాయి. 32 మంది కొవిడ్​కు బలయ్యారు.
  • తైవాన్​లో 22,044 కరోనా కేసులు బయటపడగా.. 42 మంది మృతి చెందారు.
Last Updated :Aug 8, 2022, 9:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.