ETV Bharat / bharat

దేశంలో తగ్గిన కరోనా వ్యాప్తి.. ఆ రాష్ట్రంలో తొలిసారి సున్నా కేసులు!

author img

By

Published : Apr 11, 2022, 9:28 AM IST

Updated : Apr 11, 2022, 11:40 AM IST

INDIA COVID CASES
INDIA COVID CASES

దేశంలో కొత్తగా 861 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఛత్తీస్​గఢ్​లో 24 గంటల వ్యవధిలో ఒక్క కరోనా కేసు బయటపడలేదు.

India covid cases: దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య తగ్గింది. మరోసారి కేసులు వెయ్యి లోపునకు పడిపోయాయి. కొత్తగా 861 మందికి వైరస్ సోకినట్లు తేలింది. 24 గంటల వ్యవధిలో 929 మంది కోలుకున్నారు. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
• మొత్తం కేసులు: 4,30,36,132‬
• మరణాలు: 5,21,691
• యాక్టివ్ కేసులు: 11,058
• కోలుకున్నవారు: 4,25,03,383

• India vaccination: దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా సాగుతోంది. ఆదివారం 2,44,870 మందికి టీకాలు అందించారు. ఆదివారం వయోజనులందరికీ బూస్టర్ డోసు పంపిణీ ప్రారంభం కాగా.. తొలిరోజు 9,674 మంది మాత్రమే మూడో టీకా తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు 12-14 ఏళ్ల వయసు పిల్లల్లో 2.22 కోట్ల మందికి తొలి డోసు టీకాలు ఇచ్చినట్లు వెల్లడించింది. మొత్తం పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,85,74,18,827కు చేరింది.
• ఛత్తీస్​గఢ్​లో సున్నా కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో ఒక్క కరోనా కేసు కూడా బయటపడలేదని, రెండేళ్లలో ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. దీంతో కరోనా పాజిటివిటీ రేటు సున్నాకు చేరుకుంది.

ఇదీ చదవండి: లాక్‌డౌన్‌తో చైనీయులు ఉక్కిరిబిక్కిరి.. ఆహారం కోసం అరుపులు

Last Updated :Apr 11, 2022, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.