ETV Bharat / bharat

దిల్లీ, మహారాష్ట్రలో కరోనా విలయం- రాష్ట్రాలకు కేంద్రం లేఖ

author img

By

Published : Jan 1, 2022, 8:33 PM IST

india covid cases
కరోనా కేసులు

India covid news: పలు రాష్ట్రాల్లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో 9,170 కేసులు వెలుగులోకి వచ్చాయి. బంగాల్​లో 4,512, దిల్లీలో 2,716.. కేరళలో 2,435 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది. కొవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించింది.

India Covid cases state wise: దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. మహారాష్ట్రలో 9,170 కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మరణించారు. ఒక్క ముంబయి నగరంలోనే ఏకంగా 6,347 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో 5,712 మందికి లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. 451 మంది కోలుకున్నారని చెప్పారు.

Maharashtra lockdown news

రాష్ట్రంలో లాక్​డౌన్ విధించే అంశంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని మహారాష్ట్ర వైద్య శాఖ మంత్రి రాజేశ్ తోపె పేర్కొన్నారు. పాజిటివిటీ రేటు, ఆక్సిజన్ వినియోగం, ఆస్పత్రుల్లో రోగుల చేరికలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆక్సిజన్ వినియోగం 700 మెట్రిక్ టన్నులు దాటితే.. రాష్ట్రంలో ఆటోమెటిక్​గా లాక్​డౌన్ అమలులోకి వస్తుందని చెప్పారు. ప్రస్తుతం అమలు చేస్తున్న ఆంక్షలతో.. కరోనాను నియంత్రణలోకి వస్తే మంచిదేనని.. లేదంటే కఠిన నిబంధనలను తీసుకొస్తామని వెల్లడించారు. దీనిపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే త్వరలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారని చెప్పారు.

bhima koregaon 204 anniversary
భీమా-కోరేగావ్ యుద్ధం జరిగి 204 వసంతాలు పూర్తైన నేపథ్యంలో పుణెలోని భీమా కోరేగావ్​లో భారీగా జనం
bhima koregaon 204 anniversary
.
bhima koregaon 204 anniversary
.
  • Delhi covid cases today: మరోవైపు, దిల్లీలోనూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 2,716 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఒకరు మరణించారు. మే 21 తర్వాత ఇవే అత్యధిక రోజువారీ కేసులు అని దిల్లీ వైద్య శాఖ వెల్లడించింది. పాజిటివిటీ రేటు 3.64 శాతంగా ఉందని పేర్కొంది.
    delhi cannaut
    కొత్త సంవత్సరం సందర్భంగా దిల్లీ కన్నౌట్ ప్రాంతంలో ఇలా..
    delhi cannaut
    దిల్లీలోని కన్నౌట్ ప్రాంతంలో...
  • Kerala covid cases news: కేరళలోనూ భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. 48,658 నమూనాలు పరీక్షించగా.. 2,435 మందికి పాజిటివ్​గా తేలిందని రాష్ట్ర వైద్య శాఖ ప్రకటించింది. 22 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది.
  • West Bengal covid update: బంగాల్​లో 4,512 కేసులు నమోదయ్యాయి. ఇందులో 2,398 కేసులు కోల్​కతా పరిధిలో వెలుగులోకి వచ్చాయి.

రాష్ట్రాలకు కేంద్రం లేఖ

Centre letter to states Covid: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. వైరస్​ కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది. తాత్కాలిక ఆసుపత్రులు సహా... కేసుల గుర్తింపు, హోం ఐసోలేషన్‌ పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. కరోనా స్వల్ప లక్షణాలు ఉన్న వారి ఐసోలేషన్‌ కోసం హోటల్‌ గదులను సిద్ధం చేయాలని సూచించారు. జిల్లాలు, వార్డుల వారీగా కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేయాలని తెలిపారు.

కరోనా పరీక్షలు, అంబులెన్సులు, ఆసుపత్రుల్లో పడకల ఏర్పాటుకు యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచాలని రాజేశ్‌ భూషణ్‌ సూచించారు. అవసరమైన వారు ఫోన్‌ చేయగానే అంబులెన్సులు, ఆసుపత్రి పడకలు సిద్ధం చేసేలా ఈ యంత్రాంగం ఉండాలని స్పష్టం చేశారు. దీని అందుబాటు గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలు సహా పిల్లలపై రాష్ట్రాలు ప్రత్యేక దృష్టి సారించాలని, అవసరమైన రవాణా, ఆక్సిజన్‌ అందుబాటు గురించి నిరంతరం సమీక్ష నిర్వహించాలని తెలిపారు.

ఇదీ చదవండి: కొవిడ్ వ్యాక్సిన్​ అని చెప్పి.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.