ETV Bharat / bharat

India Covid cases: దేశంలో మరో 6,984 మందికి కరోనా

author img

By

Published : Dec 15, 2021, 9:34 AM IST

India Covid cases: భారత్​లో తాజాగా 6,984 మందికి కరోనా సోకింది. మరో 247 మంది కొవిడ్​ ధాటికి బలయ్యారు. ఒక్కరోజే 8,168 మంది వైరస్​ను జయించారు.

India Covid cases
India Covid cases

India Covid cases: దేశంలో రోజువారి కరోనా కేసుల సంఖ్యలో స్వలంగా పెరుగుదల నమోదైంది. కొత్తగా 6,984 మంది కొవిడ్​ బారిన పడ్డారు. మరో 247 మంది వైరస్​తో మరణించారు. 24 గంటల వ్యవధిలో 8,168 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

  • మొత్తం మరణాలు: 4,75,888
  • యాక్టివ్ కేసులు: 87,562
  • కోలుకున్నవారు: 3,41,46,931

Vaccination in India

దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం జోరుగా సాగుతోంది. మంగళవారం 68,89,025 మంది లబ్ధిదారులకు వ్యాక్సిన్​ అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 1,34,61,14,483కు చేరింది.

World Covid cases

ప్రపంచవ్యాప్తంగా 6,08,382 కొత్త కేసులు వెలుగుచూశాయి. తాజాగా 7,271 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 27,17,37,744 చేరగా.. మొత్తం మరణాలు 53,36,869 పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 4,99,003 మంది కోలుకున్నారు.

  • అమెరికాలో కొవిడ్​ పంజా కొనసాగుతోంది. ఒక్కరోజే 1,08,566 కరోనా​ కేసులు వెలుగుచూశాయి. 1,598 మంది మరణించారు.
  • బ్రిటన్​లో తాజాగా 59,610 కొవిడ్​ కేసులు బయటపడ్డాయి. 150 మంది వైరస్ ధాటికి మృతి చెందారు.
  • రష్యాలో కరోనా మృత్యుఘంటికలు మోగిస్తోంది. ఒక్కరోజే 1,145 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 28,343 కేసులు వెలుగుచూశాయి.
  • ఫ్రాన్స్​లో కొత్తగా 63,405 కేసులు నమోదయ్యాయి. మరో 158 మంది చనిపోయారు
  • జర్మనీలో వైరస్ విజృంభిస్తోంది. తాజాగా 40,795 కేసులు నమోదవగా.. 475 ప్రాణాలు కోల్పోయారు.
  • స్పెయిన్​లో తాజాగా 26,136 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 58 మంది మరణించారు.

ఇదీ చదవండి: 'కెనాల్​ మ్యాన్'​ జలయజ్ఞం- 5 ఊళ్ల కోసం ఒంటరిగా కాలువ తవ్వకం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.