ETV Bharat / bharat

ఏప్రిల్‌ 30న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం

author img

By

Published : Mar 10, 2023, 12:33 PM IST

Updated : Mar 10, 2023, 2:48 PM IST

new secretariat Inauguration తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా.. పలుమార్లు వాయిదా పడిన సచివాలయం ఎట్టకేలకు ఏప్రిల్ 30న ప్రారంభం కానుంది. దీనిని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఇక తెలంగాణ అమర వీరుల స్మృతి చిహ్నం జూన్ 2న ప్రారంభించనున్నారు.

KCR
KCR

new secretariat Inauguration: తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవ తేదీ ఖరారైంది. ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా.. పలు మార్లు వాయిదా పడింది. ఇక ఏప్రిల్‌ 30న నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దీనిని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. నూతనంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయానికి డా.బీఆర్‌ అంబేడ్కర్‌ రాష్ట్ర సచివాలయంగా పేరు పెట్టిన విషయం తెలిసిందే. కొత్త సచివాలయాన్ని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణం చేపట్టారు.

ఇక జూన్ 2న తెలంగాణ అమర వీరుల స్మృతి చిహ్నం ప్రారంభించనున్నారు. జూన్ 2న మనం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటామని తెలిసిందే. అయితే ఈ సందర్భంగా అమరవీరుల స్మృతి చిహ్నాన్ని ప్రారంభించనున్నారు.

గతంలో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17న సచివాలయం ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్ రావడంతో.. సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఇక అప్పట్లో నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఈ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు కేసీఆర్. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌తో వాయిదా పడింది. ఇప్పుడు జరిగే ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందుతుందో లేదో చూడాలి. ఇక ఇదిలా ఉంటే.. నూతన సచివాలయంలో గతంలో అగ్ని ప్రమాదం కూడా సంభవించింది. సచివాలయం కింది అంతస్థులో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. దీంతో అధికారులు అప్పట్లో చర్యలు చేపట్టారు.

ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో ఆకర్షణలతో నూతన సచివాలయం నిర్మాణం జరుగుతోంది. జూన్ 27వ తేది 2019న నూతన సచివాలయానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. నాలుగేళ్ల వ్యవధిలోపే సచివాలయం నిర్మాణం పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలిచే ఈ సచివాలయం రూ.610 కోట్ల వ్యవయంతో రూపుదిద్దుకుంటోంది.

నూతన సచివాలయం చూడగానే నిజాం కాలం నాటి కట్టడాలు కళ్ల ముందు కదలాడుతాయి. ఈ డిజైన్ కోసం... ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. దశాబ్దాల కాలంపాటు నిజాం నవాబుల పాలనలో హైదరాబాద్ ఉండటంతో... అలనాటి వైభవానికి ఏమాత్రం తీసిపోకుండా అత్యాధునిక హంగులతో కొత్త సచివాలయం నిర్మించారు. మొత్తం 11.45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన సచివాలయం రూపొందించారు. ఎత్తు 278 అడుగులు ఉండగా.. గ్రౌండ్ ఫ్లోర్‌తో కలిసి మొత్తం ఏడు ఫ్లోర్లతో నిర్మాణం చేపట్టారు. రూఫ్ టాప్‌లో స్కై లాంజ్ సచివాలయానికి ప్రత్యేక ఆకర్షణ. ఆహ్లాదకరమైన పార్కులతో సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు పటిష్ఠమైన భద్రత మధ్య సచివాలయం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఇంతటి నిర్మాణం ఏప్రిల్ 30న ప్రారంభం కానుంది.

ఇవీ చదవండి:

Last Updated :Mar 10, 2023, 2:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.