ETV Bharat / bharat

అఫ్గాన్​లో పుట్టి భారతీయతలో భాగమైన​ 'ఇంగువ' కథ

author img

By

Published : Aug 24, 2021, 5:15 PM IST

hing
ఇంగువ

'పోపులో ఇంగువ వేశావా?', 'అహా.. పప్పు ఘుమఘుమలాడిపోతోంది.. ఇంగువ(hing powder) ఎక్కువ వేశావేంటి?'.. ఇలాంటి ప్రశ్నలు భారతీయుల వంటింట్లో తరచూ వింటూనే ఉంటాము. ఇంగువకు ఈ స్థాయిలో ప్రత్యేక స్థానం ఉంది(hing in indian cooking). అలాంటిది.. ఇంత ఆదరణ ఉన్న ఇంగువకు భారత్​ పుట్టినిల్లు కాదంటే నమ్మగలరా?

భారతీయుల ఇళ్లల్లో.. పోపుల డబ్బా పక్కన 'ఇంగువ'కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. వంటింట్లో ఘుమఘుమలకు కారణమైన ఈ ఇంగువను దేశ ప్రజలు విపరీతంగా ఉపయోగిస్తుంటారు(hing in Indian cooking). ఇంత ఆదరణ పొందుతున్న ఇంగువకు పుట్టిల్లు భారత్​ కాదంటే నమ్మగలరా? కానీ అదే నిజం. అఫ్గానిస్థాన్​లో పుట్టి.. భారతీయుల వంటల్లో ఓ భాగమైపోయింది ఈ ఇంగువ!

అఫ్గాన్​లో పుట్టి.. భారత్​లో..

ఇంగువను ఆంగ్లంలో 'హింగ్​' (hing powder) అంటారు. దీనిని దేశంలో సాగుచేయరు. అఫ్గానిస్థాన్​లో ఉండే 'ఫెరుల అసఫొటిడా' అనే చెట్టు నుంచి ఈ ఇంగువ వస్తుంది. కొన్నేళ్లుగా తజకిస్థాన్​, ఉజ్బెకిస్థాన్​ సహా ఇతర దేశాలు ఇంగువను సాగు చేస్తున్నాయి.

భారత్​లో ఇంగువ దిగుమతులు ఎలా ఉన్నాయి?

2017 నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సాగుచేస్తున్న ఇంగువలో 40శాతం వాటాను భారత్​ దిగుమతి చేసుకుంటోంది. ఇందులో 92శాతం అఫ్గానిస్థాన్​ నుంచి వచ్చినవే. 2019లో దిగుమతుల విలువ 100మిలియన్​ డాలర్లు దాటిపోయింది.

మరి ఇంగువను దేశంలోనే సాగు చేసుకోవచ్చు కదా?

అసఫొటిడా చెట్లకు పొడి నేల ఉండాయి. అంతకుమించి.. ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటకూడదు. భారీ వర్షాలు కురిసే భారత్​ వంటి దేశాల్లో ఇంగువ సాగు కష్టమే.

కానీ ఇంగువకున్న డిమాండ్​ చూసి దేశంలోనూ దానిని సాగు చేసేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. తొలిసారిగా.. హిమాచల్ ​ప్రదేశ్​లో నిరుపయోగమైన శీతల భూభాగాల్లో ఇంగువ పంట పండించేందుకు 'ద ఇన్​స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోరిసోర్స్ టెక్నాలజీ'(ఐహెచ్​బీటీ-సీఎస్ఐఆర్) 2020 అక్టోబర్​లో చర్యలు చేపట్టింది(hing cultivation in india). లాహాల్ ప్రాంతంలో రైతులతో కలిసి ఇంగువ సాగు చేస్తోంది. ఈ ప్రయోగాల ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే కనీసం ఐదేళ్లు ఆగాల్సిందే.

ఇంతకీ.. అసలు ఇంగువ భారత్​లోకి ఎలా వచ్చింది?

ఈ ప్రశ్నకు సరైన సమాధానం లేనప్పటికే.. అనేక హిందు, బౌద్ధ పుస్తకాల్లో ఇంగువ అనేకమార్లు ప్రస్తావనకు వచ్చింది. మహాభారతంలోనూ ఇంగువ గురించి ఉన్నట్టు చరిత్రకారులు చెబుతున్నారు.

ఇప్పుడు పరిస్థితేంటి?

అఫ్గాన్​లో తాలిబన్ల(taliban news) ఆక్రమణతో పరిస్థితులు మారిపోయాయి. అక్కడి నుంచి దిగుమతులయ్యే వస్తువుల ధరలు పెరిగే అవకాశమున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బాదం వంటి డ్రై ఫ్రూట్స్​పై ఇప్పటికే ఈ ప్రభావం కనిపిస్తోంది. ఫలితంగా.. ఇంగువ ధరలు పెరగడం ఖాయమని మార్కెట్​ వర్గాలు అంటున్నాయి.

ఇదీ చూడండి:- నోరూరించే హైదరాబాద్‌ సబ్జీ దమ్‌కీ బిర్యానీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.