ETV Bharat / bharat

రక్షణ మంత్రికి 'సీడీఎస్ చాపర్​ క్రాష్'​ దర్యాప్తు నివేదిక

author img

By

Published : Jan 5, 2022, 11:59 AM IST

CDS chopper crash inquiry report
సీడీఎస్ చాపర్​ క్రాష్

CDS chopper crash inquiry report: తమిళనాడు కూనూర్​ సమీపంలో జరిగిన హెలికాప్టర్​ ప్రమాదంలో సీడీఎస్​ బిపిన్​ రావత్ దంపతులు​ సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై ట్రై సర్వీస్​ దర్యాప్తు నివేదికను రక్షణ మంత్రి రాజ్​నాథ్​కు సమర్పించింది వాయుసేన.

CDS chopper crash inquiry report: భారత త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ దంపతులు సహా మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయిన హెలికాప్టర్​ ప్రమాదంపై ట్రై సర్వీస్​ దర్యాప్తు నివేదికను రక్షణ మంత్రి రాజ్​నాథ్​కు అందించింది వాయుసేన. ప్రతి అంశాన్ని క్షుణ్నంగా వివరించినట్లు అధికావర్గాలు తెలిపాయి.

ఎయిర్ మార్షల్ మన్వేంద్ర సింగ్​తో పాటు ఆర్మీ, నేవీలకు చెందిన బ్రిగేడియర్​ ర్యాంక్​ అధికారుల నేతృత్వంలో విచారణ బృందం చాపర్​ క్రాష్​పై దర్యాప్తు చేపట్టింది. ప్రమాదానికి గల కారణాలను నివేదికలో పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు. అలాగే, వీఐపీల కోసం భవిష్యత్తులో ఉపయోగించే చాపర్​ ప్రయాణాలకు పలు సిఫార్సులను సైతం నివేదికలో పొందుపర్చినట్లు పేర్కొన్నారు.

ప్రమాదం ఇలా..

తమిళనాడులోని కోయంబత్తూర్​-కూనూర్​ మధ్యలో 2021, డిసెంబర్​ 8 హెలికాప్టర్​ ప్రమాదానికి గురై భారత త్రిదళాధిపతి(సీడీఎస్​) జనరల్​ బిపిన్​ రావత్ దుర్మరణం చెందారు. వెల్లింగ్టన్​ సైనిక కళాశాలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొత్తం 14 మంది చనిపోయినట్లు వాయుసేన ప్రకటించింది.

ఇదీ చూడండి:

చదువుకున్న కాలేజీకి వెళ్తూ రావత్ దుర్మరణం- ఆ 4 గంటల్లో ఏం జరిగింది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.