ETV Bharat / bharat

ప్రజల కోసమే పని చేశా: కిరణ్​ బేడీ

author img

By

Published : Feb 17, 2021, 9:55 AM IST

Updated : Feb 17, 2021, 10:33 AM IST

తనను పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్​ పదవి నుంచి తొలగించటంపై స్పందించారు కిరణ్​బేడీ. లెఫ్టినెంట్‌ గవర్నర్​గా అవకాశమిచ్చినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ పదవితో.. తాను జీవితకాల అనుభూతి పొందానన్నారు.

I thank Govt of India for a lifetime experience in serving Puducherry as its Lt Governor; kiran bedi
ఆ పదవితో జీవితానుభవం పొందాను: కిరణ్​ బేడీ

పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్​గా పనిచేయడం వల్ల జీవితకాల అనుభూతి పొందినట్టు కిరణ్​ బేడీ వెల్లడించారు. ఈ అవకాశమిచ్చిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. తనతోపాటు రాజ్​భవన్​లో పని చేసిన అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ పదవీకాలంలో తాను పూర్తిగా సంతృప్తి చెందినట్టు.. ప్రజల అవసరాలను తీర్చేందుకు కృషి చేసినట్టు చెప్పుకొచ్చారు బేడీ.

పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఉన్న కిరణ్‌ బేడీని.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంగళవారం ఆ పదవి నుంచి తొలగించారు. ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర​రాజన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

పదవిని ఎంతో పవిత్రంగా భావించి రాజ్యాంగ బద్ధంగా, నైతికంగా తన కర్తవ్యాలను నెరవేర్చానని కిరణ్​ బేడీ అన్నారు. పుదుచ్చేరికి మంచి భవిష్యత్​ ఉందని... అది ప్రజల చేతిలోనే ఉందన్నారు. పుదుచ్చేరి ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు.

సీఎం హర్షం

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్​గా కిరణ్​ బేడీని తొలగించటంపై ముఖ్యమంత్రి నారాయణ స్వామి స్పందించారు. ఇది ప్రజల విజయం అన్నారు.

పుదుచ్చేరి సీఎంతో కిరణ్​బేడీకి కొంత కాలంగా విబేధాలు ఉన్నాయి. కిరణ్​ బేడీని తొలగించాలని రాష్ట్రపతి రామ్​నాథ్​ సింగ్​ను ఇటీవల కోరారు స్వామి.

ఇదీ చదవండి : పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్ బేడీ తొలగింపు

Last Updated :Feb 17, 2021, 10:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.