ETV Bharat / bharat

Hyderabad Metro Passes For Students : స్టూడెంట్స్​ పాస్ ప్రవేశపెట్టిన మెట్రో.. ఎప్పుడు నుంచో తెలుసా?

author img

By

Published : Jul 1, 2023, 8:15 PM IST

Updated : Jul 1, 2023, 8:57 PM IST

metro
metro

20:11 July 01

Student Metro Pass : స్టూడెంట్స్​ పాసు కోసం ప్రత్యేక కార్డు ఏర్పాటు చేసిన మెట్రో Hyderabad Metro has connected 40 crore passengers to their destinations

Student Metro Pass In Hyderabad : హైదరాబాద్​ మెట్రో రైల్​ లిమిటెడ్​ విద్యార్థులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. ఇక నుంచి మెట్రోలో విద్యార్థి పాస్ ప్రవేశపెడుతూ.. నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల సౌకర్యార్థం నేటి నుంచి సూపర్‌ సేవర్ స్టూడెంట్ పాస్-2023 అమల్లోకి తీసుకువచ్చామని మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి వెల్లడించారు. 1998 ఏప్రిల్ 1 తర్వాత పుట్టిన విద్యార్థులందరూ ఈ పాస్ పొందేందుకు అర్హులని తెలిపారు. ఈ ఆఫర్ కింద విద్యార్థులు 20 ట్రిప్పులకు మాత్రమే చెల్లించి అన్ని ఫేర్ జోన్‌లలో 30 ట్రిప్పుల వరకూ ఉచితంగా ప్రయాణించవచ్చని.. విద్యార్థులు తప్పనిసరిగా కొత్త బ్రాండెడ్‌ స్మార్ట్ కార్డ్ కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. ఒక విద్యార్థికి ఒక స్మార్ట్ కార్డ్ మాత్రమే జారీ చేస్తారని, అది కొనుగోలు చేసిన తేదీ నుంచి 30 రోజుల వరకు చెల్లుబాటు అవుతుందన్నారు. ఈ ఆఫర్ జూలై 1, 2023 నుండి మార్చి 31, 2024 వరకు అందుబాటులో ఉంటుందని వివరించారు.

విద్యార్థులు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు జేఎన్‌టీయూ కాలేజ్‌, ఎస్‌ఆర్ నగర్‌, అమీర్‌పేట, విక్టోరియా మెమోరియల్‌, దిల్‌సుక్‌నగర్, నారాయాణగూడ, నాగోల్, పరేడ్ గ్రౌండ్, బేగంపేట్‌ మెట్రో స్టేషన్‌లలో పాస్​లు కొనుగోలు చేయాలని సూచించారు. సూపర్ సేవర్ మెట్రో పాస్‌లను కొనుగోలు చేసిన విద్యార్థులకు హైదరాబాద్ మెట్రో రైలుతో అనుసంధానం గల రిలయన్స్ ట్రెండ్‌, 24 సెవెన్ కన్వీనియన్స్ స్టోర్‌లు తదితర వాణిజ్య సంస్థల ద్వారా రాయితీ కూపన్​లను కూడా పొందవచ్చని మెట్రో అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన విద్యార్థి పాసును మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి, ఎల్​ అండ్​ టీ ఎండీ ఆవిష్కరించారు.

Hyderabad Metro Is New Record : మరోవైపు హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు మైట్రోరైల్‌ 40కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసింది. 2017 నవంబర్ 29న ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో రైలు...ప్రతి రోజు 4లక్షల 90వేల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అయితే మెట్రోలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. కొద్ది రోజుల్లోనే ఐదు లక్షల మార్కు దాటుతుందని అంచనా వేస్తున్నామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం రోజు వారీ ప్రయాణికుల సంఖ్య 6.7లక్షలుగా ఉండగా...అత్యధికంగా రోజుకు 1.40లక్షల మంది ఐటీ, ఐటీ అనుబంధ రంగాల ఉద్యోగులు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఆ తర్వాత విద్యార్థులు రోజుకు 1.20లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారని ఎన్వీఎస్ రెడ్డి వివరించారు.

ఇవీ చదవండి :

Last Updated :Jul 1, 2023, 8:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.