ETV Bharat / bharat

How To Get Zomato Gold Membership : జొమాటో గోల్డ్ మెంబర్​షిప్ ఉచితం.. ఎలా పొందాలో తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2023, 3:16 PM IST

How to Get Zomato Gold Membership : మీరు తరచుగా జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారా? అయితే ఇది మీ కోసమే. జొమాటో తిరిగి తీసుకొచ్చిన గోల్డ్ మెంబర్​షిప్ పొందడం ద్వారా.. మీరు అనేక ప్రయోజనాలు పొందవచ్చు. మరి, ఈ సభ్యత్వాన్ని ఎలా పొందాలి? దాని ప్రయోజనాలేంటి? అన్న వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

How to Get Zomato Gold Membership
How to Get Zomato Gold Membership

Zomato Gold Membership in India : ప్రముఖ ఆన్​లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో.. యూజర్లకు శుభవార్త అందించింది. గతంలో నిలిపేసిన జొమాటో గోల్డ్’ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ఆ సంస్థ తిరిగి ప్రారంభించింది. గతంలో మూడు నెలల జొమాటో గోల్డ్ మెంబర్​షిప్​ను(Zomato Gold Membership) రూ. 999కు అందించగా.. ఇప్పుడు దాన్ని చాలా వరకు తగ్గించింది. అది ఎంత అనేది.. సభ్యత్వం తీసుకునే సమయంలో కనిపిస్తుంది. మీరు ఈ సభ్యత్వాన్ని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. మరి.. ఈ జొమాటో గోల్డ్ మెంబర్​షిప్​ను ఎలా తీసుకోవాలో చూద్దాం.

How to get Zomato Gold Membership in Telugu :

  • మీరు ముందుగా ఫోన్​లో Zomato యాప్‌ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత మీ ఖాతాకు లాగిన్ అవ్వాలి.
  • లాగిన్ అయ్యాక ఎగువ కుడి మూలలో ఉన్న “Profile Photo”పై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. కొంచెం కిందకు స్క్రోల్ చేస్తే "Zomato గోల్డ్" ఆప్షన్ కనిపిస్తుంది.
  • ఆ తర్వాత 'Join Gold now'పై క్లిక్ చేయాలి.
  • ఆపై మీరు "Get Membership"పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత వచ్చే విండోలో మీరు "Notify me"పై నొక్కాలి.
  • ఇప్పుడు మీరు సభ్యత్వం పొందడానికి కొంత సమయం వేచి ఉండాలి.
  • నిజానికి Zomato Gold New అనేది మునుపటి సబ్‌స్క్రిప్షన్ "Zomato Gold"అప్‌గ్రేడ్ ఫీచర్.
  • ఇది కొత్త ఫీచర్ కాబట్టి వారు మీకు సభ్యత్వాన్ని అందజేసే వరకు వేచి ఉండాలి.
  • ఇప్పుడు మీరు Zomato యాప్ (ఈ-మెయిల్ లేదా ఫోన్ నంబర్) ద్వారా Zomato గోల్డ్ కొత్త ఆహ్వాన నోటిఫికేషన్‌ను స్వీకరించిన తర్వాత మీరు ఎంచుకున్న ప్లాన్ ప్రకారం డబ్బులు చెల్లించాలి.
  • UPI, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా ఇతర పద్ధతిలో చెల్లింపు చేయవచ్చు.
  • ఆ ప్లాన్ ధర చెల్లించిన తర్వాత మీరు "జొమాటో గోల్డ్ న్యూ" మెంబర్ అవుతారు.

జొమాటో ఇన్​స్టంట్​.. ఇక 10 నిమిషాల్లోనే ఫుడ్​ డెలివరీ!

How to get Free Zomato Gold Membership use Coupon Codes :

ఉచితంగా మెంబర్​షిప్ పొందాలంటే..?

  • ముందుగా మీరు Zomato యాప్‌ని ఓపెన్ చేయాలి. అనంతరం "ప్రొఫైల్ పిక్చర్"పై నొక్కాలి.
  • ఆ తర్వాత కొద్దిగా క్రిందికి స్క్రోల్ చేసి.. "Coupons" కేటగిరి కింద Collected Coupons అనే ఆప్షన్ చూస్తారు.
  • దానిపై క్లిక్ చేస్తే మీకు మొత్తం amount of coupons కనిపిస్తాయి.
  • అలాగే మీరు మీ స్థానానికి సమీపంలో ఉన్న లోకేషన్​లో hidden couponsను కనుగొంటారు.
  • మీరు వివిధ రెస్టారెంట్‌ల నుంచి ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడల్లా కూపన్స్ యాడ్ అవుతూ ఉంటాయి.
  • ఇలా “Free Zomato Gold membership” పొందడానికి మీరు ఈ కూపన్‌లను ఉపయోగించవచ్చు.

How to get Free Zomato Gold Membership use Paytm First :

ఉచిత Zomato గోల్డ్ మెంబర్‌షిప్ పొందడానికి Paytm ఫస్ట్ ఉపయోగించండిలా..

  • ముందుగా మీ Paytm యాప్‌ని ఓపెన్ చేయాలి.
  • ఆ తర్వాత ఎగువన ఉన్న search bar కోసం చూడండి. ఆ తర్వాత "First" అని టైప్ చేయాలి.
  • ఆపై Paytm First మెంబర్‌షిప్ లోగోపై నొక్కి.. సభ్యత్వం తీసుకోవాలి.
  • మీరు అందులో చేరిన తర్వాత అనేక ఆఫర్లను చూడవచ్చు.
  • ఈ ఆఫర్‌లు బ్రాండ్ గిఫ్ట్ కార్డ్‌లపై ఉంటాయి. అందులో జొమాటో, స్విగ్గీ కూడా ఉంటాయి.
  • మీరు మీ Paytm వాలెట్‌కు డబ్బును యాడ్ చేయడానికి ఉచిత Paytm మనీని ఉపయోగించవచ్చు.
  • Paytm First సభ్యత్వాన్ని కొనుగోలు చేయడానికి ఈ డబ్బును ఉపయోగించవచ్చు. ఈ సభ్యత్వం మీకు Zomato గిఫ్ట్ కార్డ్‌లను అందిస్తుంది.
  • ఈ గిఫ్ట్ కార్డ్‌లను ఉపయోగించి మీరు ఉచిత Zomato గోల్డ్ మెంబర్‌షిప్ పొందవచ్చు.

Google Meet Wedding: పెళ్లి గూగుల్​ మీట్​లో.. జొమాటోలో విందు..!

జొమాటో గోల్డ్ మెంబర్‌షిప్ బెనిఫిట్స్ :

Zomato Gold Membership Benefits : Zomato గోల్డ్ మెంబర్‌షిప్‌తో మీరు చాలా గొప్ప ప్రయోజనాలను పొందుతారు. ఇది మీ డబ్బును ఆదా చేయడమే కాకుండా మీకు అనేక ఇతర ప్రయోజనాలనూ అందిస్తుంది.

ఉచిత డెలివరీ : మీరు Zomato గోల్డ్ మెంబర్‌షిప్ కలిగి ఉంటే ఉచిత డెలివరీ లభిస్తుంది. ఇది 10కి.మీ కంటే తక్కువ దూరంలో ఉన్న అన్ని రెస్టారెంట్‌లకు వర్తిస్తుంది. కానీ మీ ఆర్డర్ 199 రూపాయల కంటే ఎక్కువగా ఉండాలి.

ఆన్-టైమ్ గ్యారెంటీ : మీ ఆర్డర్ మీకు సకాలంలో అందేలా Zomato చూసుకుంటుంది. ఇది మీకు సమయానికి చేరుకోకపోతే.. కూపన్ లభిస్తుంది. ఈ కూపన్ మీకు మీ ఆర్డర్ విలువపై 100% వరకు తగ్గింపును అందిస్తుంది.

30% వరకు అదనపు తగ్గింపు : మీరు Zomato గోల్డ్ మెంబర్‌షిప్‌తో అదనంగా 30% తగ్గింపును పొందుతారు. దేశమంతటా జొమాటోతో భాగస్వామ్యం ఉన్న రెస్టారెంట్లకు ఇది వర్తిస్తుంది.

రద్దీ సమయంలో VIP యాక్సెస్ : అధిక డిమాండ్ ఉన్న సమయాల్లో మీ కోసం మరిన్ని రెస్టారెంట్లు అందుబాటులో ఉంటాయి. ఇది Zomato గోల్డ్ సభ్యత్వం పెద్ద ప్రయోజనం.

ఆఫ్‌లైన్ Zomato రెస్టారెంట్‌లలో గరిష్ఠంగా 40% తగ్గింపు : మీరు Zomatoని ఉపయోగించి ఆఫ్‌లైన్ డైనింగ్ టేబుల్‌ను బుక్ చేసినప్పుడు దేశమంతటా 10,000కి పైగా పార్టనర్ రెస్టారెంట్‌లలో 40% వరకు తగ్గింపు పొందుతారు. ఇది మీకు భారీగా డబ్బు ఆదా చేస్తుంది.

ఇకపై దిల్లీ, కోల్​కతా నుంచి హైదరాబాద్​కు ఫుడ్ డెలివరీ.. జొమాటో నయా సర్వీస్

స్విగ్గీ, జొమాటోలకు ప్రభుత్వ యాప్ పోటీ.. తక్కువ ధరకే ఫుడ్ ఆర్డర్ చేస్కోండిలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.