ETV Bharat / bharat

How to Download EC From Dharani Portal : ధరణి పోర్టల్‌ నుంచి.. ఈసీని డౌన్​లోడ్ చేసుకోవడం చాలా ఈజీ..

author img

By

Published : Aug 19, 2023, 3:11 PM IST

EC Download From Dharani : తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు.. ఇతర ఆస్తుల క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వం ధరణి పోర్టల్​ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మరి, ఇందులోనుంచి ECని డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా అన్నది మీకు తెలుసా..?

EC Download From Dharani
How to Download EC From Dharani portal

Encumbrance Certificate : రాష్ట్రంలో భూములు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లను సులభతరం చేయడానికంటూ.. 2020వ సంవత్సరంలో ప్రభుత్వం "ధరణి పోర్టల్‌"ను అమల్లోకి తెచ్చింది. ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టేందుకే ఈ పోర్టల్ తీసుకొచ్చామని సర్కారు ప్రకటించింది. అయితే.. ఇప్పటి వరకూ EC డౌన్ లోడ్ చేసుకోవాలంటే.. కార్యాలయాలు, ఇతర ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ.. ఇప్పుడు ధరణి పోర్టల్ ద్వారానే.. ఈసీని డౌన్ లోడ్ చేసుకోవచ్చని మీకు తెలుసా? ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

EC అంటే ఏమిటి..?

What is EC :

ఈసీ (EC) అంటే.. ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (Encumbrance Certificate). ఇందులో.. ఫలానా భూమి ఇప్పటి వరకు ఎన్నిసార్లు చేతులు మారింది. అమ్మిన వారు ఎవరు..? కొనుగోలు చేసింది ఎవరు..? అనే వివరాలు ఈసీలో ఉంటాయి. ఏదైనా భూమిని కొనుగోలు చేస్తున్నప్పుడు.. కొనేవారు తప్పకుండా ఆ భూమికి సంబంధించిన ఈసీని తీసుకోవాలి. తద్వారా.. ఆ భూమికి నిజమైన ఓనరు ఎవరు..? ఇప్పుడు యజమానిగా చెబుతున్న వ్యక్తేనా? కాదా? అనే విషయం తేలిపోతుంది. అందువల్ల.. భూముల కొనుగోలు విషయంలో ఈసీ అనేది అత్యంత కీలకంగా పనిచేస్తుంది.

Dharani Portal Telangana How it Works : "ధరణి" పోర్టల్ ఎలా పనిచేస్తుంది? రైతులకు ఎలా ఉపయోగపడుతుంది..?

ధరణి వల్ల ఉపయోగాలు ఏంటి..?

  • ధరణి పోర్టల్ రెండు విభాగాలుగా పనిచేస్తుంది. అందులో ఒకటి వ్యవసాయ భూములు, రెండోది వ్యవసాయేతర భూములు.
  • సాగు భూములు వ్యవసాయ కేటగిరీలోకి వస్తాయి. ఇళ్లు, ప్లాట్లు, ఇతర వాణిజ్య సముదాయాలు వ్యవసాయేతర కేటగిరీలోకి వస్తాయి.
  • ఏదైనా ఆస్తిని విక్రయించాలంటే.. భూ యజమాని ముందుగా "ధరణి"లోకి లాగిన్ కావాల్సిందే.
  • యజమాని పోన్ నెంబర్ ద్వారా మాత్రమే ఇది సాధ్యం. ఓటీపీ ఎంటర్ చేస్తేనే లాగిన్ అవ్వగలరు.
  • ఆ తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తయ్యే లోపు ప్రతీ దశలో.. మెసేజ్ లు వస్తూనే ఉంటాయి.
  • తద్వారా యజమానికి తెలియకుండా భూమిని విక్రయించడం సాధ్యం కాదు.
  • ఇలా.. ఎలాంటి అవకతవకలకు ఛాన్స్ లేకుండా.. రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ప్రభుత్వం చెబుతోంది.

ధరణి పోర్టల్‌ నుంచి ECని ఎలా డౌన్‌లోడ్ చేయాలి..?

  • మొదటగా ధరణి పోర్టల్ అధికారిక వెబ్‌సైట్‌ www.dharani.telangana.gov.in లోకి వెళ్లాలి.
  • ఓపెన్ అయిన తర్వాత అగ్రికల్చర్ (Agriculture) అనే ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత ధరణి పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి.
  • ఆ తర్వాత ఎడమ వైపు భాగంలో ఉన్న IM4 Search EC Details అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత జిల్లా, మండలం, గ్రామం, సర్వే నెంబర్, ఖాతా నెంబర్‌ను నమోదు చేయాలి.
  • నమోదు చేసిన తర్వాత సర్వే నెంబర్‌కు సంబంధించిన భూ లావాదేవీల వివరాలు పోర్టల్‌లో కనిపిస్తాయి.
  • పక్కన ఉన్న Statement of Encumbrance Certificate PDF అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే సులువుగా ఈసీ డౌన్లోడ్ అవుతుంది.
  • చివరగా ఆ పీడీఎఫ్‌ను ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది.

ధరణి సమస్యల పరిష్కారంపై సర్కార్ కసరత్తు.. మాడ్యూళ్లపైనే ప్రత్యేక దృష్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.