ETV Bharat / bharat

How to Apply for Kalyana Lakshmi / Shaadi Mubarak Scheme and Check Status : కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలకు దరఖాస్తు.. స్టేటస్ ఇలా తెలుసుకోండి!

author img

By

Published : Aug 16, 2023, 1:39 PM IST

Updated : Aug 16, 2023, 3:23 PM IST

Kalyana Lakshmi / Shaadi Mubarak Application : కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల గురించి అందరికీ తెలుసు. కానీ.. దరఖాస్తు చేయాలంటే ఎవరో ఒకరిపై ఆధారపడుతుంటారు చాలా మంది. మరి, స్వయంగా మనమే ఆన్ లైన్లో ఎలా అప్లై చేయాలో ఈ స్టోరీలో చూద్దాం.

How to Apply for Kalyana Lakshmi and Shaadi Mubarak Scheme in Telangana
How to Apply for Kalyana Lakshmi and Shaadi Mubarak Scheme in Telangana

Shaadi Mubarak / Kalyana Lakshmi Status : ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లికి.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సహకారం అందించేందుకు తీసుకొచ్చిన పథకాలే కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్. ఈ పథకాల ద్వారా ఆడబిడ్డల పెళ్లికి 1,00,116 రూపాయలను ప్రభుత్వం అందిస్తోంది. మరి, ఈ పథకాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎవరు అర్హులు? ఎలాంటి పత్రాలు సమర్పించాలి? స్టాటస్ ఎలా తెలుసుకోవాలి? వంటి పూర్తి సమాచారాన్ని ఈ స్టోరీలో చూద్దాం.

ఇవీ అర్హతలు..

Eligibility for Shaadi Mubarak / Kalyana Lakshmi :

  • కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకునేవారు శాశ్వతంగా తెలంగాణ వాసులై ఉండాలి.
  • వధువుకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
  • వరుడి వయస్సు కనీసం 21 ఏళ్లపైన ఉండాలి.
  • కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షల లోపు ఉండాలి.

ఎలాంటి పత్రాలు అవసరం?

Which Documents need for Kalyana Lakshmi /Shaadi Mubarak :

  • వధువు ఫొటో
  • వధువు బర్త్ సర్టిఫికెట్
  • ఆధార్ కార్డు
  • వధువు, ఆమె తల్లి బ్యాంకు పాస్‌బుక్‌ కాపీ
  • ఈ పత్రాలను స్కాన్ చేసి.. jpg ఫార్మాట్లో, సైజ్ 150KB కన్నా తక్కువ ఉండేలా సేవ్ చేసుకుని సిద్ధంగా ఉండాలి.
  • దరఖాస్తుదారులు ఆన్ లైన్లో స్వయంగా అప్లై చేసుకోవచ్చు. లేదంటే.. మీ సేవా కేంద్రాన్ని సందర్శించినా సరిపోతుంది.

Dharani Portal Telangana How it Works : "ధరణి" పోర్టల్ ఎలా పనిచేస్తుంది? రైతులకు ఎలా ఉపయోగపడుతుంది..?

ఎలా దరఖాస్తు చేయాలి?

How to Apply Kalyana Lakshmi /Shaadi Mubarak :

  • ముందుగా telanganaepass.cgg.gov.in వెబ్ సైట్లోకి వెళ్లాలి.
  • హోమ్ పేజీ ఓపెన్ అయిన తర్వాత కాస్త కిందకు స్క్రోల్ చేస్తే "కళ్యాణ లక్ష్మి /షాదీ ముబారక్" ఆప్షన్ కనిపిస్తుంది. మీకు ఏది కావాలంటే.. దానిపై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు తెరుచుకున్న పేజీలో.. పైన కల్యాణ లక్ష్మీ, కింద షాదీ ముబారక్ రిజిస్ట్రేషన్ ఆప్షన్స్ కనిపిస్తాయి.
  • ఇక్కడ "రిజిస్ట్రేషన్" అనే ఆప్షన్​ను సెలక్ట్ చేసుకోండి.
  • ఇప్పుడు పెళ్లికూతురు వ్యక్తిగత సమాచారం మొదలు.. కులం, ఆదాయం, చిరునామా, బ్యాంక్ అకౌంట్ వంటి వివరాలన్నీ సమర్పించాలి.
  • ఆ తర్వాత వరుడి వయస్సు కూడా నిర్ధారించాల్సి ఉంటుంది. మరికొంత సమాచారం అందించాలి.
  • చివరలో అన్ని ధ్రువపత్రాలకు సంబంధించిన స్కాన్ కాపీని అప్ లోడ్ చేయాలి.
  • సమాచారం మొత్తం అందించిన తర్వాత.. "Submit" ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది.

How to Apply for New Gas Connection in Online : ఆన్​లైన్లో కొత్త గ్యాస్ కనెక్షన్.. చాలా ఈజీగా అప్లై చేసుకోండి!

స్టేటస్ ఎలా తెలుసుకోవాలి..?

How to Know the Status of Kalyana Lakshmi and Shaadi Mubarak :

  • కల్యాణ లక్ష్మీ/షాదీ ముబారక్.. పథకాలకు దరఖాస్తు చేసుకున్న తర్వాత.. ఆమోదం లభించిందా లేదా? అనే స్టేటస్ తెలుసుకునే సౌలభ్యం కూడా ఆన్​లైన్లో ఉంది.
  • ఇందుకోసం కూడా telanganaepass.cgg.gov.in వెబ్ సైట్​నే సందర్శించాలి.
  • దరఖాస్తు చేసే సమయంలో హోమ్ పేజీలో క్లిక్ చేసిన.. కల్యాణ లక్ష్మీ/షాదీముబారక్ ఆప్షన్ పైనే క్లిక్ చేయాలి.
  • ఇక్కడ Registration ఆప్షన్ కింద Pring/Status అనే ఆప్షన్ ఉంటుంది.
  • ఇప్పుడు ఆధార్ నంబర్, ఫోన్ నంబర్ అడుగుతుంది. అవి ఎంటర్ చేస్తే చాలు.. వెంటనే సమాచారం అందిస్తుంది.
  • పథకం ప్రారంభించిన మొదట్లో.. రూ.51,000 సాయం అందించింది ప్రభుత్వం. ఆ తర్వాత దాన్ని రూ. 75,116లకు, ఆ తర్వాత రూ.1,00,116లకు పెంచింది.
  • నిధులు నేరుగా వధువు తల్లి ఖాతాలో జమ అవుతాయి.

కల్యాణ లక్ష్మీ సొమ్ము కోసం భార్యను తగలబెట్టాడు

Kalyana Lakshmi Funds Fraud: పెళ్లికి ముందే 'కల్యాణలక్ష్మి'... పక్కా ప్లాన్​తో కొట్టేశారిలా!!

Last Updated : Aug 16, 2023, 3:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.