ETV Bharat / bharat

అలర్ట్ ​- ఇల్లు అద్దెకు ఇస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 1, 2023, 3:02 PM IST

Precautions to House Owners: ఈ మ‌ధ్య‌కాలంలో ఇళ్లు అద్దెకు తీసుకునేవారి సంఖ్య విప‌రీతంగా పెరిగిపోతోంది. హైద‌రాబాద్ లాంటి మ‌హాన‌గ‌రంలో ఎక్కువ మంది ఉద్యోగులే ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అయితే ఇళ్లు అద్దెకు ఇచ్చే వరకు బాగానే ఉన్నా.. తర్వాతర్వాత కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ఇంటిని రెంట్​కి ఇచ్చే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి..

Precautions to House Owners
Precautions to House Owners

Precautions to House Owners : నగరాలు, పట్టణాల్లో.. అద్దె ఇళ్లల్లో నివసించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గతంలో ఇంట్లో గదులు ఖాళీగా ఉంటే అద్దెకు ఇచ్చేవారు. కానీ.. ఇప్పుడు అద్దెకు ఇవ్వడానికే ఇళ్లు నిర్మిస్తున్నవారు కూడా ఉన్నారు. రెంట్ రూపంలో అదనంగా వచ్చే సంపాదన లాభదాయకంగా ఉండడం కూడా ఇందుకు కారణమవుతోంది. ఉద్యోగం, ఉపాధి కోసం నగరాలు, పట్టణాలకు వెళ్తున్నవారు అనివార్యంగా అద్దె గదుల్లో నివాసం ఉండాల్సిందే.

అయితే, అద్దెకు ఉండ‌టం సుల‌భ‌మే కానీ.. ఇంటిని అద్దెకు ఇవ్వ‌డం యాజ‌మానికి అంత సుల‌భం కాదు. ఎందుకంటే.. అద్దెకుండేవారితో భ‌విష్య‌త్తులో పలు సమస్యలు కూడా ఎదురు కావొచ్చు. పరిస్థితులు.. వాదోప‌వాదాల నుంచి, న్యాయ‌ప‌ర‌మైన స‌వాళ్లు ఎదుర్కోవడం వరకూ వెళ్లొచ్చు. ప్రాపర్టీని అద్దెకు, లీజుకు తీసుకున్నవారు.. ఖాళీ చేయబోమంటూ భీష్మించిన ఘటనలు అనేకం. అంతేకాదు.. పలానా ప్రాపర్టీ తమదేనంటూ ఎదురు తిరిగిన సందర్భాలూ ఉన్నాయి.

అందుకే.. నివాస ప్రాప‌ర్టీని అద్దెకు ఇచ్చే స‌మ‌యంలో.. ఇంటి య‌జ‌మాని స్వంత హ‌క్కుల‌ను కాపాడుకోవ‌డం కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ సూచనలు ఇప్పుడు ఎందుకంటే.. ఇటీవల గంజాయి, వ్య‌భిచారం, డ్ర‌గ్స్ లాంటి దందాలు పెచ్చుమీరుతున్నాయి. ఉగ్రవాద స్లీపర్ సెల్స్​ కూడా సాధారణ మనుషుల్లాగే వచ్చి అద్దెకు ఇల్లు అడగొచ్చు. సాధారణ ఇళ్లే వీరికి అడ్డాలుగా మారుతున్నాయి. అద్దె ఇంట్లో ఉంటూ.. ఇంటి య‌జ‌మానుల‌కు తెలియ‌కుండా తమ పనులు కానిచ్చేస్తున్నారు. కాబట్టి ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

వీళ్లు మామూలు ముదుర్లు కాదు - 'అద్దె' ప్రకటనలతో డబ్బులే డబ్బులు

ఇళ్లు అద్దెకు ఇచ్చేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • ఇంటి యజమానులు ఇంటిని అద్దెకు ఇచ్చేముందు.. అన్ని వివరాలు తెలుసుకోవాలి.
  • చాలా మంది ఓనర్లు.. కేవలం రెండు విషయాలే అడుగుతారు. "ఎంత మంది ఉంటారు..? ఫ్యామిలీ లేదా బ్యాచ్​లర్స్​..?" అనే ప్రశ్నలే వేస్తారు.
  • వారు ఏం పని చేస్తున్నారు..? అన్నది తప్పక తెలుసుకోవాలి. కొందరు ఏదో ఒక జాబ్ పేరు చెబుతుంటారు.
  • దాని గురించి సరిగా తెలియదని వదిలేయవద్దు. వారు చెప్పిన కంపెనీకి సంబంధించిన ప్రాథమిక వివరాలు తెలుసుకోవాలి.
  • ఇంటిని రెంట్​కు ఇచ్చే ముందు.. స‌కాలంలో అద్దె చెల్లించ‌డానికి వారికుండే సామ‌ర్ధ్యం గురించి త‌ప్ప‌క తెలుసుకోవాలి.
  • అద్దెకు ఉన్నవారు రెంట్ చెల్లించ‌కుండా.. ఇంటిని ఖాళీ చేసిన సందర్భాలు అనేకం.
  • లీగ‌ల్‌గా వెళితే న్యాయ ప్ర‌క్రియ చాలా నెమ్మ‌దిగా ఉంటుంది. ఇటువంటి ప‌రిస్థితుల్లో య‌జ‌మాని ఆర్థికంగా న‌ష్ట‌పోవ‌డ‌మే కాకుండా మాన‌సిక క్షోభ‌కు గురయ్యే అవకాశం ఉంది.
  • కాబట్టి అద్దెకుండేవారి వృత్తి వివ‌రాలు, వ్య‌క్తిగ‌త వివ‌రాలు తెలుసుకోవ‌డ‌మే కాకుండా వాటి జిరాక్స్ కాఫీల‌ను ద‌గ్గ‌ర ఉంచుకోవ‌డం చాలా మంచిది.
  • ఇళ్లు నీట్​గా ఉంచుతున్నారా లేదా? అనేది తెలుసుకోవాలి. ఇందుకోసం.. నెలకోసారి య‌జ‌మాని వెళ్లి చూడాలి.

క్రెడిట్ కార్డుతో హౌస్​​ రెంట్​ కడుతున్నారా ? ట్యాక్స్ నోటీసులు వస్తాయి జాగ్రత్త!

  • అపార్ట్​మెంట్​లు రెంట్​కు ఇస్తే.. నీరు, విద్యుత్ ఛార్జీలు, మెయింటనెన్స్​ ఛార్జీలు టైం కి చెల్లిస్తున్నారో లేదో తెలుసుకోవాలి.
  • అలాగే ఇంటిని ఖాళీ చేసే సమయంలో డ్యామేజెస్​ ఏమైనా జరిగాయా అనే విషయాన్ని గమనించాలి.
  • ఒకవేళ ఏమైనా డ్యామేజె​ జరిగితే.. వాటికి సంబంధించిన డబ్బులను వసూలు చేసుకోవాలి.

అద్దెపై 18% జీఎస్​టీ అందరూ కట్టాల్సిందేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.