ETV Bharat / bharat

Hijab row: సిక్కు విద్యార్థినికీ 'హిజాబ్' సెగ.. తలపాగా తొలగించాలని..

author img

By

Published : Feb 24, 2022, 5:20 PM IST

Hijab row: కర్ణాటకలో తీవ్రదుమారం రేపిన హిజాబ్ వివాదం.. సిక్కు విద్యార్థినిని చుట్టుముట్టింది. తను చుట్టుకున్న తలపాగా తీసివేయాలని కళాశాల యాజమాన్యం ఆదేశించింది. కర్ణాటక హైకోర్టు తీర్పునకు కట్టుబడి ఉండాలని పేర్కొంది.

Hijab row
Sikh girl told to remove turban

Hijab row: హిజాబ్​ వివాదంపై కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఆదేశాల మేరకు ఓ అమృతధారి (బాప్టిజం తీసుకున్న) సిక్కు బాలికను తలపాగా తొలగించాలని కళాశాల యాజమాన్యం ఆదేశించింది. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది.

హిజాబ్ వివాదంపై విచారణలో భాగంగా.. తుది తీర్పు వెలువరించే వరకు తరగతి గదుల్లో విద్యార్థులు.. శాలువాలు, హిజాబ్​లు, స్కార్ఫ్​లు, మతపరమైన జెండాలను ధరించరాదని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. దీని గురించి ఫిబ్రవరి 16న కళాశాలను తెరిచిననాడే విద్యార్థులకు సమాచారం అందించినట్లు కళాశాల అధికారులు తెలిపారు.

సిక్కు బాలికకూ ఇలా..

ప్రీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్​ డిప్యూటీ డైరెక్టర్​ సదరు కళాశాలను సందర్శించిన సందర్భంగా.. కొందరు బాలికలు హిజాబ్ ధరించడాన్ని గమనించారు. వారికి కోర్టు ఆదేశాల గురించి వివరించి, దానికి కట్టుబడి ఉండాలని చెప్పారు. ఈ తీర్పు సిక్కులకూ వర్తింపజేయాలని ఆ బాలికలు డిమాండ్​ చేశారు.

దీంతో సిక్కు బాలిక తండ్రితో మాట్లాడిన కళాశాల యాజమాన్యం.. కోర్టు తీర్పు గురించి చెప్పి, దానిని పాటించాలని పేర్కొంది. అయితే బాలిక తలపాగా తొలగించదని ఆమె కుటుంబసభ్యులు బదులిచ్చినట్లు సమాచారం. కోర్టు ఉత్తర్వుల్లో సిక్కు తలపాగా గురించి ప్రస్తావన లేదని వారు పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఇదీ వివాదం..

గతేడాది డిసెంబర్​ చివర్లో హిజాబ్ వివాదం మొదలైంది. హిజాబ్ ధరించిన కొందరు మహిళలను ఉడుపిలోని ఓ ప్రభుత్వ ప్రీ-యూనివర్సిటీ కళాశాల యాజమాన్యం లోపలికి అనుమతించలేదు. దీనిపై నిరసన వ్యక్తమైంది. దీంతో హిందూ విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి కళాశాలలోకి వచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో హిజాబ్ అనుకూల, వ్యతిరేక ఆందోళనలు తీవ్రమయ్యాయి.

ఈ నేపథ్యంలోనే కర్ణాటకలోని అనేక ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు ఫిబ్రవరి 9న సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. కోర్టు ఆదేశానుసారం ఫిబ్రవరి 14న పాఠశాలలను, 16న కళశాలలను తెరిచారు. కాగ, ఈ వ్యవహారంపై ప్రస్తుతం హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.

ఇదీ చూడండి:

సద్దుమణగని 'హిజాబ్' వివాదం.. ఆ కళాశాల మూసివేత!

హిజాబ్​ ఇష్యూలో విద్యార్థులపై తొలికేసు- లెక్చరర్​ రాజీనామా

హిజాబ్​పై కర్ణాటక సర్కార్​ మరో కీలక నిర్ణయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.