ETV Bharat / bharat

రూ.113కోట్ల హెరాయిన్ సీజ్​.. ముగ్గురు అరెస్టు..

author img

By

Published : Apr 3, 2022, 5:33 AM IST

Heroin Seized
హెరాయిన్

Heroin Seized: కోల్​కతా విమానాశ్రయంలో 16.5 కేజీల హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దాని విలువ అంతర్జాతీయ మర్కెట్లో రూ.113 కోట్లు ఉంటుందని తెలిపారు.

Heroin Seized: కోల్​కతా విమానాశ్రయంలో రూ.113 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను సీజ్​ చేశారు అధికారులు. డ్రగ్స్​ను అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు మహిళలు సహా మరో వ్యక్తిని అరెస్టు చేశారు. 16.5 కేజీల హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో ఏయిర్​పోర్టులో అధికారులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఈ క్రమంలో కెన్యా నుంచి వస్తున్న ఓ మహిళ, మరో వ్యక్తిని, హవాయి నుంచి వస్తున్న మరో మహిళను అడ్డగించారు.

వారికి సంబంధించిన వస్తువులను తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఓ పౌడర్​ను వారి బ్యాగుల్లో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. పరీక్షల్లో ఆ పౌడర్ హెరాయిన్​గా గుర్తించారు. నిందితులు ఆయా దేశాల నుంచి దుబాయ్​కి వెళ్లి అక్కడి నుంచి భారత్​కు వస్తున్నట్లు వెల్లడించారు. ముగ్గుర్ని అరెస్టు చేసి.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి: బైక్​ ర్యాలీపై రాళ్ల దాడి.. 35 మందికి గాయాలు.. కర్ఫ్యూ విధింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.