ETV Bharat / bharat

వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి

author img

By

Published : Apr 18, 2021, 12:22 AM IST

హరియాణాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మరణించారు. బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొని నలుగురు.. మరో ప్రమాదంలో ఒకరు చనిపోయారని పోలీసులు తెలిపారు.

Road accident
రోడ్డు ప్రమాదం

హరియాణా జింద్​ జిల్లాలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు చనిపోగా.. మరొకరు ఒకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

నార్వానా నుంచి హన్సీ వైపు వెళ్తున్న బస్సు.. ఓ ద్విచక్ర వాహనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మరణించారు. మృతులను.. రోష్ని(55), ఆమె కుమార్తె సీమా(30), మనవడు లలిత్​(4)గా గుర్తించారు. మరో వ్యక్తి భీరా(35)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

మృతదేహాల పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

మరో ప్రమాదంలో

ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న మరో ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. మరొకరు గాయపడ్డారు. మృతుడిని అశోక్‌గా గుర్తించారు పోలీసులు.

ఇదీ చూడండి: పుట్టినరోజు వేడుకలో అపశ్రుతి- ఆరుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.