ETV Bharat / bharat

Haryana Farmer Got 200 Crore : రైతు బ్యాంక్​ ఖాతాలో రూ.200 కోట్లు జమ!.. వారి అకౌంట్లలోకి లక్షలు!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2023, 1:43 PM IST

Updated : Sep 8, 2023, 7:07 PM IST

Haryana Farmer Got 200 Crore : ఓ రైతు బ్యాంకు ఖాతాలో ఒక్కసారిగా రూ.200 కోట్ల నగదు జమ అయ్యాయన్న వార్త కలకలం రేపింది. అతడు తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించమంటూ స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. మరోవైపు ఓ గుర్తుతెలియని ఖాతా నుంచి 30 మందికిపైగా బ్యాంక్​ ఖాతాల్లోకి వేలు, లక్షల రూపాయలు బదిలీ అయ్యాయి. ఇంతకీ ఈ రెండు సంఘటనలు ఎక్కడ జరిగాయంటే..

Odisha People Received Lakhs Of Rupees In Their Accounts From Unknown Sources
Haryana Farmer Received Rs.200 Crores In His Bank Account

Haryana Farmer Got 200 Crore : హరియాణాకు చెందిన ఓ రైతు బ్యాంకు ఖాతాలో గురువారం ఉన్నట్టుండి రూ.200 కోట్ల డబ్బు డిపాజిట్​ అయ్యాయన్న వార్త చర్చనీయాంశమైంది. ఆ వ్యక్తి గ్రామస్థులతో కలిసి వెంటనే స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ కంప్లైంట్​లో అభ్యర్థించాడు.

హరియాణాలోని చక్రీ దాద్రీ జిల్లాకు చెందిన విక్రమ్​ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే గురువారం విక్రమ్​ తన బ్యాంక్​ ఖాతా బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు బ్యాంక్​కు వెళ్లాడు. అక్కడ ఒక్కసారిగా అతడి ఖాతాలో రూ.200 కోట్లు జమ అయ్యాయని చెప్పాడు. గ్రామస్థుల సాయంతో వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.

ఎంత పడ్డాయో అప్పుడే చెప్పగలము..!
అయితే ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసుల వాదన​ మరోలా ఉంది. విక్రమ్​ ఖాతాలో కేవలం రూ.60 వేలు మాత్రమే గుర్తించామని.. అతడు చెబుతున్నట్లుగా రూ.200 కోట్లు లేవని అంటున్నారు. అయినప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో అకౌంట్​లో ఎవరు డిపాజిట్​ చేశారు, ఎందుకు చేశారు అనే వివరాలను శుక్రవారం బ్యాంక్​ కార్యాలయానికి వెళ్లి దర్యాప్తు జరుపుతామని పోలీసులు చెబుతున్నారు. బ్యాంక్​ స్టేట్​మెంట్​లు సహా ఇతర వివరాలను బ్యాంక్​ అధికారులను అడిగి తెలుసుకుంటామని.. పూర్తి విచారణ తర్వాతే ఎంత మొత్తంలో సొమ్ము విక్రమ్​ ఖాతాలో​ జమ అయిందో చెప్పగలమని బధ్రా పోలీస్​ స్టేషన్​ అసిస్టెంట్​ ఎస్​పీ విశాల్​ కుమార్​ తెలిపారు.

ఆ బ్యాంకు ఖాతాల్లోకి లక్షల్లో ట్రాన్స్​ఫర్​..!
Lakhs Of Rupees From Unknown Sources In Odisha : ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలోనూ అచ్చం ఇదే తరహా ఘటన వెలుగు చూసింది. ఔల్​ బ్లాక్​ పరిధి భటిపాడా గ్రమంలోని గ్రామ్యా బ్యాంక్​ ఖాతాదారుల అకౌంట్లలో ఉన్నట్టుండి లక్షల్లో డబ్బులు జమ అయ్యాయి. మొత్తం 40కిపైగా బ్యాంక్​ ఖాతాల్లో రూ.2 వేల నుంచి రూ.2 లక్షల వరకు సొమ్ము గుర్తుతెలియని ఖాతాల నుంచి గురువారం బదిలీ అయినట్లుగా బ్యాంక్ అధికారులు గుర్తించారు.

బ్యాంకు తెరవకముందే..!
ఇక తమ అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయని ఖాతాదారుల ఫోన్​లకు సందేశాలు వెళ్లాయి. దీంతో వారంతా డబ్బు విత్​డ్రా కోసం ఒక్కసారిగా బ్యాంకుకు పరుగులు తీశారు. ఈ క్రమంలో గురువారం బ్యాంకు తెరవకముందే పరిసరాలు మొత్తం గ్రామస్థులతో కిక్కిరిసిపోయాయి. ప్రజలు పెద్ద ఎత్తున బ్యాంక్​కు చేరుకోవడం వల్ల సంబంధిత ఉద్యోగులు వారిని నియంత్రించేందుకు పోలీసులకు సమాచారం అందించారు.

"గురువారం ఉదయం బ్యాంకు తెరవకముందే జనాలు పెద్ద ఎత్తున డబ్బు ఉపసంహరణ కోసం తరలివచ్చారు. దీంతో మాకు అనుమానం వచ్చి సదరు ఖాతాలకు డబ్బులు ఎలా వచ్చాయని 300 అకౌంట్ల వరకు పరిశీలించాము. కొందరి ఖాతాల్లో రూ.30వేలు, రూ.40వేలు ఇలా రూ.2 లక్షల వరకు జమ అయ్యాయి. దీంతో వారు ఆనందంలో మునిగి తేలుతున్నారు."

- బ్యాంక్​ మేనేజర్​

ఇక దీనికి సంబంధించి సమాచారం అందుకున్న పట్టముండి ఎస్​డీపీఓ సంఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ వ్యవహారంపై ఔల్​ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Last Updated : Sep 8, 2023, 7:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.