ETV Bharat / bharat

కరోనా మూడో దశ హెచ్చరికలు.. వాటి ఎగుమతిపై ఆంక్షలు

author img

By

Published : Aug 17, 2021, 4:59 AM IST

Updated : Aug 17, 2021, 6:53 AM IST

కొవిడ్‌- 19 యాంటీజెన్‌ టెస్టింగ్‌ కిట్ల ఎగుమతులపై ఆంక్షలు విధిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో మూడో దశ కరోనా విజృంభణ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

corona testing kits
కరోనా టెస్టింగ్​ కిట్​లు

కరోనా వైరస్‌ ఆనవాళ్లను నిర్ధరించేందుకు వినియోగిస్తున్న ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టింగ్‌ కిట్ల ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది. దేశంలో థర్డ్‌వేవ్‌కు అవకాశం ఉందంటూ పలువురు నిపుణులు హెచ్చరిస్తున్న వేళ ఈ నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌- 19 యాంటీజెన్‌ టెస్టింగ్‌ కిట్‌లను ఎగుమతులపై ఆంక్షల కేటగిరీలో ఉంచుతున్నామని, తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీఎఫ్‌టీ) నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ఆంక్షల కేటగిరీలో ఉంచిన వస్తువులను ఎగుమతి చేయాలంటే ఎగుమతిదారులు డీజీఎఫ్‌టీ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. రాబోయే కాలంలో మన దేశంలో థర్డ్‌వేవ్‌కు అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఈ కిట్‌ల లభ్యతను పెంచడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఇదీ చూడండి: వణికిస్తున్న మహమ్మారి- లక్ష్యానికి దూరంగా టీకా ప్రక్రియ

Last Updated :Aug 17, 2021, 6:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.