ETV Bharat / bharat

44కోట్ల టీకా డోసులకు కేంద్రం ఆర్డర్​

author img

By

Published : Jun 8, 2021, 5:57 PM IST

center orders covaxin covishield, centre places orders vaccine
44 కోట్ల టీకా డోసులకు కేంద్రం ఆర్డర్​

కేంద్రం 44 కోట్ల కొవాగ్జిన్​, కొవిషీల్డ్​ టీకా డోసులు కొనుగోలు చేసింది. 25 కోట్ల కొవిషీల్డ్​, 19 కోట్ల కొవాగ్జిన్​ డోసులకు ఆర్డర్​ చేసినట్లు వెల్లడించింది. ఇప్పటికే కొనుగోలుకు అయ్యే మొత్తంలో 30 శాతాన్ని సంబంధింత సంస్థలకు చెల్లించినట్లు స్పష్టం చేసింది.

ప్రధాని నరేంద్ర మోదీ కొత్త వ్యాక్సిన్​ పాలసీ ప్రకటించిన నేపథ్యంలో 44 కోట్ల టీకా డోసులను కేంద్రం కొనుగోలు చేసింది. ఈ డోసులను ఆగస్టు-డిసెంబరు నెలల మధ్య ఉత్పత్తిదారులు పంపిణీ చేస్తారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. సీరం సంస్థ నుంచి 25 కోట్ల డోసులను కొవిషీల్డ్​లను, భారత్​ బయోటెక్​ నుంచి 19 కోట్ల కొవాగ్జిన్​ డోసులకు ఆర్డర్​ చేసినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే టీకా డోసుల కొనుగోలుకు అయ్యే మొత్తంలో 30 శాతాన్ని ఉత్పత్తి సంస్థలకు చెల్లించామని స్పష్టం చేసింది.

18 ఏళ్ల దాటిన వారికి టీకా అందించేందుకు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా వ్యాక్సిన్​లను సరఫరా చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రకటించారు. ఈ పంపిణీ జూన్​ 21 నుంచి ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : 'ఉచిత వ్యాక్సిన్​, రేషన్ ​ఖర్చు రూ. 1.45 లక్షల కోట్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.