ETV Bharat / bharat

తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి లెక్కలు ఇలా...

author img

By

Published : Apr 24, 2022, 12:02 PM IST

Cryptocurrency Price in India
Gold price in Hyderabad

Gold Rate Today: బంగారం, వెండి ధరలు ఆదివారం స్వల్పంగా తగ్గాయి. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.54వేల 100కుపైగా ఉంది. వెండి ధర కిలో రూ.70వేల దిగువన ఉంది. అంతర్జాతీయంగా క్రిప్టోకరెన్సీల్లో బిట్​ కాయిన్ విలువ పెరిగింది.

Gold Rate Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.300 మేర తగ్గింది. కిలో వెండి రూ. 535 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ.68,575గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.54,100గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు, అంతర్జాతీయంగా క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.54,100 గా ఉంది. కిలో వెండి ధర రూ.68,575 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.54,100 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.68,575 గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.54,100 గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,575 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.54,100 గా ఉంది. కేజీ వెండి ధర రూ.68,575 వద్ద కొనసాగుతోంది.
  • స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే.. అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1,930.30 డాలర్లు పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 24.19 డాలర్లుగా ఉంది.

ఇంధన ధరలు ఇలా.. దేశంలో ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా ధరలను పెంచుకుంటూ వస్తున్న చమురు సంస్థలు పెట్రో బాదుడుకు విరామం ఇచ్చాయి. దీంతో వాహనదారులకు ఊరట లభించింది. గత గురువారం నుంచి చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ రూ. 105.45, లీటర్​ రూ. 96.71గా ఉంది.

  • ముంబయిలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.120.5 చేరగా, లీటర్​ డీజిల్​ రూ. 104.75గా ఉంది.
  • వైజాగ్​లో లీటర్​ పెట్రోల్​ రూ. 119.98గా ఉండగా, లీటర్​ డీజిల్​ రూ. 105.63గా కొనసాగుతోంది.
  • హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్​ ధర రూ. 105.47గా ఉంది.

Cryptocurrency Price in India: క్రిప్టో కరెన్సీల్లో బిట్​కాయిన్​ విలువ క్రితం రోజుతో పోల్చితే రూ.65వేల వరకు తగ్గింది. ఇతర ప్రధాన క్రిప్టోకరెన్సీల సూచీలు కూడా ఇదే బాటలో కొనసాగుతున్నాయి.

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.30,41,767
ఇథీరియంరూ.2,25,897
డోజ్​కాయిన్రూ.10.26
టెథర్రూ.76.50
బీఎన్​బీ కాయిన్రూ.30,957
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.