ETV Bharat / bharat

Girl Suicide After Being Accused Of Cloths Theft : బట్టలు దొంగతనం చేసిందని పొరుగింటి మహిళ ఆరోపణలు.. మనస్తాపంతో బాలిక ఆత్మహత్య

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2023, 10:30 PM IST

Updated : Oct 3, 2023, 10:52 PM IST

Girl Suicide After Being Accused Of Cloths Theft : తమ బట్టలు దొంగతనం చేసిందని పక్కింటి మహిళ చేసిన ఆరోపణలకు మనస్తాపం చెంది ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

Girl Suicide After Being Accused Of Cloths Theft
Girl Suicide After Being Accused Of Cloths Theft

Girl Suicide After Being Accused Of Cloths Theft : తమ బట్టలు దొంగతనం చేసిందని పక్కింటివారు చేసిన ఆరోపణలకు మనస్తాపం చెందింది ఓ బాలిక. దీంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ కౌశాంబిలో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ఇదీ జరిగింది
కరారి పోలీస్ స్టేషన్​ పరిధిలోని అఢహరా గ్రామానికి చెందిన నకుల్​కు కొన్నేళ్ల క్రితం వివాహం కాగా భార్య మృతి చెందింది. నకుల్​కు 14 ఏళ్ల కుమార్తె అనామిక ఉంది. అయితే, భార్య మృతి చెందడం వల్ల నకుల్.. మరో మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. చదువులో చురకైన అనామికను.. తండ్రి, సవతి తల్లి ఇద్దరు కలిసి వేధించేవారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం పక్కింట్లో ఉండే మహిళ.. అనామిక తమ బట్టలు దొంగతనం చేసిందని ఆరోపించింది. దీంతో ఆగ్రహించిన నకుల్​.. అనామికను తీవ్రంగా కొట్టాడు. తండ్రి కొట్టడం వల్ల మనస్తాపానికి గురైన ఆమె.. కుటుంబసభ్యులు అందరూ పొలానికి వెళ్లిన తర్వాత ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఇంటికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

స్కూల్ బస్సు ఢీకొని ఆరేళ్ల చిన్నారి మృతి
ఉత్తర్​ప్రదేశ్​ హథ్రాస్​లో స్కూల్​ బస్సు ఢీకొని ఆరేళ్ల చిన్నారి మృతి చెందాడు. బస్సు వెనక్కి తీసుకుంటున్న క్రమంలో డ్రైవర్​.. చిన్నారిని గమనించకుండా నడపడం వల్ల అక్కడిక్కడే మరణించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ జరిగింది
సాదాబాద్​లోని ఝాగ్​రార్​ గ్రామానికి చెందిన రాజేశ్​.. కుటుంబంతో కలిసి ఆగ్రాలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడి ఆరేళ్ల కుమారుడు హర్షిత్ గౌతమ్​ స్థానిక సీమాక్స్ పబ్లిక్ స్కూల్​లో చదువుతున్నాడు. మంగళవారం గ్రామానికి వచ్చిన స్కూల్​ బస్సు ప్రమాదవశాత్తు చిన్నారిని ఢీ కొట్టడం వల్ల అక్కడిక్కడే మరణించాడు. బస్సు వెనక్కి తీసుకుంటున్న క్రమంలో డ్రైవర్​.. అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సును స్వాధీనం చేసుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ మృతుడి తరఫు బంధువులు సాదాబాద్ పోలీస్ స్టేషన్​ ఎదుట ఆందోళన చేపట్టారు.

Hyderabad Man Killed in London : లండన్‌లో హైదరాబాద్ వాసి హత్య.. కూతురు పెళ్లి కోసం భారత్​కు వద్దామనుకునేలోగా దారుణం

New Born Babies Deaths In Maharashtra : ఆస్పత్రిలో ఒకే రోజు 24 మంది మృతి.. 12 మంది నవజాత శిశువులు కూడా..

Last Updated : Oct 3, 2023, 10:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.