ETV Bharat / bharat

పాపకు జన్మనిచ్చిన 17 ఏళ్ల బాలిక​.. 12 ఏళ్ల బాలుడు అరెస్ట్!

author img

By

Published : Apr 22, 2022, 8:17 PM IST

Girl gives birth to a baby: వివాహం కాకుండానే గర్భం దాల్చిన ఓ 17 ఏళ్ల బాలిక ఆడపిల్లకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు బాలికను విచారించి.. అత్యాచారం కేసులో బాధితురాలి ఇంటి సమీపంలో ఉండే 12 ఏళ్ల బాలుడిని అరెస్ట్​ చేశారు. గర్భానికి కారణం బాలుడేనా? మరెవరైనా ఉన్నారా? అనే కోణంగా దర్యాప్తు చేపట్టారు.

girl gives birth to baby
పాపకు జన్మనిచ్చిన 17ఏళ్ల బాలిక

Girl gives birth to a baby: పాఠశాల మానేసి ఇంట్లోనే ఉంటున్న ఓ 17 ఏళ్ల బాలిక వివాహం కాకుండానే గర్భం దాల్చింది. కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచిపెట్టింది. వారం క్రితం ఆడపిల్లకు జన్మనిచ్చింది. అత్యాచారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ 12 ఏళ్ల బాలుడిని అరెస్ట్​ చేశారు. తమిళనాడులోని తంజావుర్​లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇదీ జరిగింది: తంజావుర్​కు చెందిన 17 ఏళ్ల బాలిక పాఠశాల మానేసి ఇంట్లోనే ఉంటోంది. కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురైనప్పటికీ కుటుంబ సభ్యులకు చెప్పలేదు. ఏప్రిల్​ 17న తీవ్రమైన కడుపునొప్పి రావటం వల్ల ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు బాలిక గర్భవతిగా తేల్చారు. అదే రోజు ఆడపిల్లకు జన్మనిచ్చింది. వివాహం కాకుండానే పాపకు జన్మనిచ్చినట్లు తెలుసుకున్న వైద్యులు.. వెంటనే తంజావుర్​ మహిళా పోలీసులకు సమాచారం అందించారు.

ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు బాలికను విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటి సమీపంలో ఉండే ఓ 12 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడటం వల్ల గర్భం దాల్చినట్లు తెలుసుకున్నారు. బాలుడిపై పోక్సో సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని అరెస్ట్​ చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం బాల నేరస్థుల పాఠశాలకు తరలించారు. అయితే.. బాలిక గర్భానికి 12 ఏళ్ల బాలుడే కారణమా లేదా మరెవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

ఇదీ చూడండి: గర్భం దాల్చాలని ఖైదీ భార్య కోరిక.. భర్తకు 15 రోజులు పెరోల్ ఇచ్చిన కోర్టు

నాలుగేళ్ల చిన్నారిని ఇటుకతో కొట్టి చంపిన 11 ఏళ్ల బాలుడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.