ETV Bharat / bharat

G20 Declaration : జీ20​ సక్సెస్​ వెనుక 'సూపర్ మ్యాన్' అమితాబ్​.. 200 గంటలు, 300 మీటింగ్​లతో భారీ కసరత్తు

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 3:59 PM IST

G20 Declaration Delhi Sherpa
G20 Declaration Delhi Sherpa

G20 Declaration Delhi Sherpa : జీ20 న్యూదిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం సాధించేందుకు భారత్‌ షెర్పా అమితాబ్‌ కాంత్‌, ఆయన బృందం విరామం లేకుండా శ్రమించింది. వందల గంటల చర్చలు, అంతకుమించిన ద్వైపాక్షిక సమావేశాలతోపాటు 15 ముసాయిదాలు సిద్ధం చేసి.. రెండుగా విడిపోయిన పశ్చిమ దేశాలు, రష్యా-చైనా మధ్య ఏకాభిప్రాయం సాధించింది.

G20 Declaration Delhi Sherpa : జీ20 శిఖరాగ్ర సమావేశాల డిక్లరేషన్‌పై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు భారత షెర్పా అమితాబ్‌ కాంత్‌ సారథ్యంలోని దౌత్య బృందం పెద్ద కసరత్తే చేసింది. ఉక్రెయిన్‌ సంక్షోభానికి సంబంధించిన పేరాపై ఏకాభిప్రాయ సాధన కోసం తీవ్రంగా శ్రమించింది. 200 గంటలపాటు ఏకధాటి చర్చలు, 300 ద్వైపాక్షిక సమావేశాలతోపాటు 15 ముసాయిదాలు తయారు చేసింది. ఈ విషయాన్ని భారత షేర్పా అమితాబ్‌ కాంత్‌ వెల్లడించారు.

విరామం లేకుండా..
G20 Sherpa Amitabh Kant : జీ20సదస్సులో తన బృందం విరామం లేకుండా పనిచేసినట్లు తెలిపారు భారత్​ షెర్పా అమితాబ్​ కాంత్​ (G20 Sherpa Of India). మొత్తం జీ20 సదస్సులో అత్యంత క్లిష్టమైన భాగం రష్యా-ఉక్రెయిన్‌కు సంబంధించిన భౌగోళిక రాజకీయ పేరాపై ఏకాభిప్రాయం సాధించటమే అని అమితాబ్‌ కాంత్‌ ట్వీట్‌ చేశారు. ఈ ప్రక్రియను 200 గంటల చర్చలు, 300 ద్వైపాక్షిక సమావేశాలు, 15 ముసాయిదాల తయారీతో ముగించినట్లు చెప్పారు. ఇందుకోసం ఇద్దరు సమర్థమైన అధికారులు తనకు సహకరించినట్లు అమితాబ్‌ కాంత్‌ చెప్పారు.

  • The most complex part of the entire #G20 was to bring consensus on the geopolitical paras (Russia-Ukraine). This was done over 200 hours of non -stop negotiations, 300 bilateral meetings, 15 drafts. In this, I was greatly assisted by two brilliant officers - @NagNaidu08 & @eenamg pic.twitter.com/l8bOEFPP37

    — Amitabh Kant (@amitabhk87) September 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బాలి డిక్లరేషన్​ కోణంలో చూడకూడదు..
G20 Declaration India : జీ20 డిక్లరేషన్​లో ఉక్రెయిన్​కు సంబంధించిన పేరా.. విభజన ఏకాభిప్రాయం కాకుండా ఏకీకృత ఏకాభిప్రాయమని అధికార వర్గాలు తెలిపాయి. రష్యా- ఉక్రెయిన్​ సంక్షోభానికి ఇది పరిష్కారం చూపుతుందని చెప్పాయి. దిల్లీ డిక్లరేషన్​పై జీ20 దేశాల ఏకాభిప్రాయాన్ని ప్రస్తావిస్తూ.. అది ప్రధాని నరేంద్ర మోదీ హామీతో పాటు కృషిగా పలువురు అధికారులు వర్ణించారు. డిక్లరేషన్​లో ఉన్న అని అంశాలపై జీ20 దేశాలు వంద శాతం ఏకీభవించాయని చెప్పారు. దిల్లీ డిక్లరేషన్‌లోని ఉక్రెయిన్ వివాదానికి సంబంధించిన పేరాలను గతేడాది బాలి డిక్లరేషన్ కోణంలో చూడకూడదని అన్నారు.

భారత్​కు స్పెషల్​ థ్యాంక్స్​: రష్యా
G20 Summit Delhi 2023 Russia : భారత్​ అధ్యక్షతన జరిగిన జీ20 సదస్సు.. అనేక విధాలుగా పురోగతి సమ్మేళమని రష్యా పేర్కొంది. అనేక సవాళ్లపై ముందుకు సాగడానికి ప్రపంచ దేశాలకు మార్గాన్ని చూపించిందని తెలిపింది. గ్లోబల్​ సౌత్​ సామర్థ్యంతో పాటు ప్రాముఖ్యాన్ని ప్రదర్శించినట్లు చెప్పింది. ఉక్రెయిన్​ సహా అనేక సమస్యలపై తమ విధానాన్ని ముందుకు తీసుకెళ్లకుండా పాశ్చాత్య దేశాలను నిరోధించడంలో భారత్​ కీలక పాత్ర పోషించిందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్​రోవ్​ తెలిపారు. జీ20ని రాజకీయం చేసే ప్రయత్నాలను నిరోధించినందుకు భారత్​కు కృతజ్ఞతలు చెప్పారు.

మేం సంతృప్తి చెందాం: ఐరోపా యూనియన్​
G20 Declaration European Union : జీ20 నేతలు ఆమోదించిన దిల్లీ డిక్లరేషన్​.. తమ చర్చలకు అనుగుణంగానే ఉందని ఐరోపా యూనియన్​ అధికారి ఒకరు తెలిపారు. తాము దిల్లీ డిక్లరేషన్​తో సంతృప్తి చెందినట్లు చెప్పారు. భారత్​ జీ20 నాయకత్వాన్ని అద్భుతమైన కర్తవ్యంగా ప్రశంసించారు. ఉక్రెయిన్​లో శాంతి నెలకొల్పడానికి దిల్లీ డిక్లరేషన్​ ఒక మెట్టు అని తెలిపారు.

దిల్లీ డిక్లరేషన్​పై శశిథరూర్​ ప్రశంసలు..
G20 Declaration Congress : భారత్‌ నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సదస్సుపై ప్రతిపక్ష నేతల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి. దిల్లీ డిక్లరేషన్‌పై సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని తీసుకురావడం వల్ల భారత్‌ చేసిన కృషిని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ కొనియాడారు. ఇది భారత్‌కు ఎంతో గర్వకారణమన్న ఆయన.. దేశం తరఫున షెర్పాగా ఉన్న అమితాబ్‌ కాంత్‌ పాత్రను అభినందించారు. శిఖరాగ్ర సదస్సులో భాగంగా దిల్లీ డిక్లరేషన్‌కు సభ్యదేశాలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో శశిథరూర్‌ ఈ విధంగా స్పందించారు.

  • Well done ⁦@amitabhk87⁩! Looks lile the IFS lost an ace diplomat when you opted for the IAS! "Negotiated with Russia, China, only last night got final draft," says India's G20 Sherpa on 'Delhi Declaration' consensus.
    A proud moment for India at G20! https://t.co/9M0ki7appY

    — Shashi Tharoor (@ShashiTharoor) September 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పెద్ద విజయమే..
G20 Declaration Delhi : జీ20 కూటమి అధ్యక్ష హోదాలో భారత్‌ శనివారం పెద్ద విజయాన్ని నమోదు చేసింది. పలు అంశాలపై భాగస్వామ్య దేశాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ సంయుక్త ప్రకటనపై ఏకాభిప్రాయాన్ని సాధించగలిగింది. ఉక్రెయిన్‌ యుద్ధం అంశంలో తలెత్తిన పీటముడిని చాకచక్యంగా పరిష్కరించగలిగింది. సంయుక్త ప్రకటనలో సంబంధిత పేరాను సవరించడం ద్వారా అన్ని దేశాల మద్దతును గెల్చుకోగలిగింది. దిల్లీలో జరుగుతున్న శిఖరాగ్ర సదస్సులో.. అధ్యక్ష స్థానంలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.

  • History has been created with the adoption of the New Delhi Leaders’ Declaration. United in consensus and spirit, we pledge to work collaboratively for a better, more prosperous, and harmonious future. My gratitude to all fellow G20 members for their support and cooperation. https://t.co/OglSaEj3Pf

    — Narendra Modi (@narendramodi) September 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

G20 Declaration 2023 : 'అణ్వాయుధాల ముప్పు ఆమోదయోగ్యం కాదు'.. ఉక్రెయిన్‌ యుద్ధంపై దిల్లీ డిక్లరేషన్‌

India Middle East Europe Corridor : పశ్చిమాసియా మీదుగా భారత్​- ఐరోపా కారిడార్​.. ప్రపంచ అభివృద్ధికి కీలకమన్న మోదీ

G20 Closing Ceremony 2023 : బ్రెజిల్ చేతికి జీ20 పగ్గాలు.. సంస్కృత శ్లోకం చదివి, సుత్తి అప్పగించిన మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.