ETV Bharat / bharat

ఆందోళన ప్రదేశంలో ఇల్లు నిర్మిస్తున్న రైతు

author img

By

Published : Mar 10, 2021, 5:24 PM IST

Fully functional house with AC being built at Singhu protest site
ఆందోళన ప్రదేశంలో ఇల్లు నిర్మిస్తోన్న రైతు

నూతన చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళ చేస్తున్న రైతుల ఎంత దృఢమైందో చెప్పడానికి ఈ ఉదంతమే ఒక ఉదాహరణ. సాగు చట్టాలను రద్దు చేసే వరకు దిల్లీని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని ఓ రైతు సింఘూ సరిహద్దులో ఇల్లును నిర్మించుకుంటున్నాడు. ఇప్పటికే ఇంటి నిర్మాణానికి కావల్సిన ఇటుకలు, సిమెంట్​ తెచ్చుకున్నాడు.

నూతన వ్యవసాయ చట్టాల్ని రద్దు చేసేంత వరకు దిల్లీ సరిహద్దుల్ని విడిచివెళ్లే ప్రసక్తే లేదని భీష్మించుకూర్చున్నారు రైతులు. ఓ రైతు ఏకంగా ఒక అడుగు ముందుకేసి సింఘూ సరిహద్దులోని రైతు ఆందోళన ప్రదేశంలో శాశ్వత నివాసాన్ని నిర్మించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఇటుకలు, సిమెంటు తెచ్చుకుని ఇంటి నిర్మాణం మొదలెట్టాడు. జీటీ కర్నల్​ రోడ్డులో నిర్మించుకుంటున్న రెండు గదుల ఇంటిలో ఏసీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపాడు.

Fully functional house with AC being built at Singhu protest site
ఆందోళన ప్రదేశంలో రైతు నిర్మిస్తోన్నఇల్లు
Fully functional house with AC being built at Singhu protest site
ఆందోళన ప్రదేశంలో ఇల్లు నిర్మిస్తోన్న రైతు

కొద్దిరోజులు గడిచాకైనా రైతులు ఇంటికి వెళతారు అని కేంద్రం భావించిందని భగత్​ సింగ్​ యూత్​ బ్రిగేడ్​ అనే సామాజిక మాధ్యమాన్ని నడుపుతున్న దీప్​ ఖాత్రి అనే వ్యక్తి అన్నాడు. కానీ సాగు చట్టాల్ని రద్దు చేసేంతవరకు రైతులు దిల్లీని వదిలి వెళ్లరని ఈటీవీ భారత్​కు తెలిపారు.

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు వందరోజులకు పైగా దిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా లెక్కచేయటం లేదు.

ఇదీ చూడండి: 'సాగు చట్టాలు రద్దు చేసేవరకూ పోరాటం ఆగదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.